Modi 3.o: కొలువుదీరిన నరేంద్ర మోడీ సర్కారు, 71 మంది మంత్రులు వీరే
న్యూఢిల్లీ: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 72 మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్, ఐదుగురు స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరితో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అట్టహాసంగా కొనసాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పలు దేశాధినేతలతోపాటు 8 వేల మంది అతిథులు హాజరయ్యారు.
మోడీ కేబినెట్
నరేంద్ర మోడీతోపాటు కేబినెట్ మంత్రులుగా అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, ఎస్ జై శంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర సింగ్ ప్రధాన్, సర్మానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరమ్, గిరిరాజ్ సింగ్, అశ్వనీ వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్రసింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్, మన్సుఖ్ మాండవీయ, కిషన్ రెడ్డి, ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘవాల్, ప్రతాప్ రావ్ గణపత్ రావు జాదవ్, హెచ్‌డీ కుమారస్వామి, రామ్మోహన్నాయుడు, జితన్ రాం మాంఝీ, లలన్ సింగ్, చిరాగ్ పాశ్వాన్.

సహాయ మంత్రులు వీరే:
జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ యశో నాయక్, పంకజ్ చౌదరి, క్రిషన్ పాల్, రాందాస్ అథవాలే, రామ్ నాథ్ ఠాకూర్, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ బఘేల్, శోభా కరంద్లాజే, కీర్తి వర్ధన్ సింగ్, బీఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేష్ గోపీ, ఎల్ మురుగన్, అజయ్ తంప్టా, బండి సంజయ్, కమలేశ్ పాసవాన్, భగీరథ్ చౌదరి, సతీశ్ చంద్ర దూబే, సంజయ్ సేథ్, రవ్ నీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికె, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజుందార్, సావిత్రి ఠాకూర్, తోకన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మొహోల్, జార్జ్ కురియన్, పబిత్ర మార్గరెటా.
मैं शपथ ग्रहण समारोह का हिस्सा बने दुनियाभर के गणमान्य अतिथियों का भी हृदय से आभारी हूं। विश्व बंधु के रूप में भारत सदैव अपने निकट साझेदारों के साथ मिलकर मानवता के हित में काम करता रहेगा। pic.twitter.com/aAmDSiz4LA
— Narendra Modi (@narendramodi) June 9, 2024
మోడీ కేబినెట్‌లో ఆరుగురు మాజీ సీఎంలు
ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం విశేషం. మూడు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్, యూపీ మాజీ సీఎం రాజ్‌నాథ్ సింగ్, అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో గుజరాత్ సీఎంగా పనిచేయడం గమనార్హం.
राष्ट्रपति भवन के प्रांगण में आज शाम हुए समारोह में मैंने प्रधानमंत्री पद की शपथ ली। मैं और मंत्रिपरिषद के मेरे सहयोगी, 140 करोड़ देशवासियों की सेवा करने और देश को विकास की नई ऊंचाइयों पर ले जाने के लिए प्रतिबद्ध हैं। pic.twitter.com/TKNNomHf0r
— Narendra Modi (@narendramodi) June 9, 2024
ఖర్గే మినహా విపక్షాలు దూరం
నరేంద్ర మోడీ కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరుకాగా పలు విపక్ష పార్టీలు ఇందుకు హాజరుకాలేదు. ఇక, రాజకీయ, వ్యాపార, సినీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తదితర ప్రముఖులు హాజరయ్యారు.
హాజరైన పలు దేశాధినేతలు
భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి పొరుగు దేశాధినేతలు తరలివచ్చారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగ్‌నౌద్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోభ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫిఫ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జులు ప్రత్యేక ఆహ్వానితులగా హాజరయ్యారు.
Congratulations to all those who have taken oath today. This team of Ministers is a great blend of youth and experience, and we will leave no stone unturned in improving the lives of people. pic.twitter.com/3PK3l1hG5p
— Narendra Modi (@narendramodi) June 9, 2024
ఈ కార్యక్రమానికి పారిశ్రామిక, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, షారుక్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, రవీనా టండన్, అనుపమ్ ఖేర్, విక్రాంత్ మస్సే వంటి ప్రముఖులు విచ్చేశారు. వీరితోపాటు అంబానీ కుమారులు అనంత్, ఆకాశ్, అల్లుడు ఆనంద్ పిరమల్ రాగా గౌతమ్ అదానీ సతీమణి ప్రీతి, సోదరుడు రాజేశ్ అదానీలు హాజరయ్యారు. మొత్తంగా దాదాపు 8వేల మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications