నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ చేరుకున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే 18వ సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొనున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నేపాల్ వెళ్లారు.

నేపాల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ రాజధాని ఖాట్మండ్‌లో ట్రామా సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష అని అన్నారు. భారత్ - నేపాల్ మధ్య సంబంధాలు బలమైనవిగా పేర్కొన్నారు.

నేపాల్‌కు భారత్ సాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే భారత్ - నేపాల్ మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయని మోడీ పేర్కొన్నారు.

నేపాల్‌లో తాను చేయనున్న పర్యటన మంచి ఫలితాలను ఇవ్వనుందని ప్రధాని నరేంద్రమోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖాట్మండ్‌లో రేపటి నుంచి జరగనున్న సార్క్ దేశాల సదస్సుకు బయలుదేరే ముందు ఆయన మీడియాకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

సార్క్ సభ్య దేశాల మధ్య రవాణా అనుసంధానం అతి త్వరలో ఏర్పాటయ్యే దిశగా సదస్సు దోహదం చేస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు సందర్భంగా ఆతిథ్య నేపాల్‌తో పాటు ఇతర దేశాధినేతలతోనూ ఆయన వేర్వేరుగా భేటీ కానున్నారు.

నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ చేరుకున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే 18వ సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొనున్నారు.

నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

నేపాల్ చేరుకున్న ప్రధాని మోడీకి అక్కడి అధికారులు సాదర స్వాగతం పలుకుతున్న దృశ్యం.

నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

నేపాల్ చేరుకున్న ప్రధాని మోడీకి శాలువాతో సత్కరించి.. బొట్టు పెడుతున్న దృశ్యం.

నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

నేపాల్ చేరుకున్న ప్రధాని మోడీకి అక్కడి చిన్నారులు స్వాగతం పలుకుతున్న దృశ్యం. నేపాల్‌కు భారత్ సాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ

నేపాల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ రాజధాని ఖాట్మండ్‌లో ట్రామా సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నేపాల్‌కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష అని అన్నారు.

ఆయా దేశాలతో భారత ద్వైపాక్షిక బంధాలు మరింతగా బలోపేతమయ్యే దిశగా కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

వేర్పాటు వాదులతో చర్చలు ఆపేస్తేనే పాక్‌తో నిర్మాణాత్మక చర్చలు జరుపుతామని భారత్ స్పష్టం చేసింది. వేర్పాటు వాదులతో చర్చించిన తరువాతే భారత్‌తో చర్చలు జరుపుతామని పాకిస్ధాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా? లేదా? అని యావత్ ప్రపంచం ఆసక్తితో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+