మోదీతో వైరల్‌గా మారిన ‘భజన్ క్లబ్బింగ్’.. అభిజీత్ దిప్కే షాకింగ్ కామెంట్స్!
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక నాయకుడు, ఆధ్యాత్మిక సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ 110వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'భజన్ క్లబ్బింగ్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా చేతితో కంజీరా వాయిస్తూ, తాళాలు వేస్తూ యువతతో కలిసి ఆధ్యాత్మిక స్వరాల్లో మునిగిపోయారు. సాంప్రదాయ భక్తి గీతాలకు ఆధునిక కన్సర్ట్ హంగులు జోడించి నిర్వహిస్తున్న ఈ కొత్త ట్రెండ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అసలేంటి ఈ 'భజన్ క్లబ్బింగ్' ట్రెండ్?
సాంప్రదాయ భజనలు, భక్తి గీతాలను ఆధునిక మ్యూజిక్ కన్సర్ట్ శైలిలో ప్రజల ముందుకు తీసుకెళ్లే విధానాన్నే 'భజన్ క్లబ్బింగ్' అంటారు. గుడులు, సాధారణ సత్సంగాలు, ఆధ్యాత్మిక సమావేశాలకే పరిమితమైన భజనలకు ఎలక్ట్రిక్ గిటార్లు, డ్రమ్స్, ఎలక్ట్రానిక్ సింథసైజర్ బీట్స్, రంగురంగుల స్టేజ్ లైటింగ్, భారీ సౌండ్ సిస్టమ్‌లను జోడించి ఈ ప్రదర్శనలను రూపొందిస్తారు. పాటల ప్రాచీన సాహిత్యం, భక్తిభావం ఏ మాత్రం మారకుండానే సంగీతంలో విపరీతమైన ఎనర్జీ నింపడం వల్ల ఇది ఆధునిక మ్యూజిక్ ఫెస్టివల్‌ను తలపిస్తుంది. ముఖ్యంగా మద్యం, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు ఏ మాత్రం తావులేకుండా, ఆరోగ్యకరమైన వాతావరణంలో యువత కలిసికట్టుగా భజనలు పాడుతూ, నాట్యం చేసేందుకు ఇది ఓ సామాజిక వేదికగా మారింది.

యువతను ఆకర్షిస్తున్న నయా సంస్కృతి
గత కొన్ని నెలలుగా ప్రధాన నగరాల్లో ఈ భజన్ క్లబ్బింగ్ కల్చర్ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా జెన్ దీ, నవతరం యువతరం పెద్ద సంఖ్యలో ఈ ఈవెంట్లకు తరలివస్తూ, డీజే హంగులతో మారిన భక్తి గీతాలకు అనుగుణంగా పాటలు పాడుతూ, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ కొత్త ట్రెండ్‌పై తన 'మన్ కీ బాత్' ప్రసంగంలో స్పందించిన ప్రధాని మోదీ.. ఇది భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునికతల అపూర్వ సమ్మేళనమని కొనియాడారు. సాంప్రదాయ పద్ధతుల నుంచి పక్కకు వెళ్లకుండానే యువతను తమ వైదిక, ఆధ్యాత్మిక మూలాల వైపు మళ్లించేందుకు ఈ ట్రెండ్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Bhajan Clubbing just got Modi Ji’s stamp 🤓
— Lala (@FabulasGuy) September 25, 2026
Cockroaches and Piddis are crying over vote chori and Modiji enjoying Bhajan Clubbing with GenZs 🤣🔥 pic.twitter.com/lrKdg7TxLj
రాజకీయ విమర్శలు, ప్రయారిటీస్ వివాదం
మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడంపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా ప్రధానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మైనర్ బాలిక దారుణ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించిన కథనాన్ని, ప్రధాని మోదీ భజన్ క్లబ్బింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్న వీడియోను ఒకే ఫ్రేమ్ లో జత చేస్తూ.. "ప్రయారిటీస్(ప్రాధాన్యతలు)" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజధాని నగరంలో శాంతిభద్రతలు, మహిళా భద్రత క్షీణిస్తున్న వేళ, సమస్యలను పక్కనపెట్టి ప్రధాని ఇలాంటి వినోదాత్మక ఈవెంట్లలో మునిగి తేలడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Priorities. https://t.co/zceqAoFipL pic.twitter.com/9Lf1awndLC
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 25, 2026
ప్రాముఖ్యత, సాంస్కృతికి విశేషాలు
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించిన 'అంత్యోదయ' తత్వాన్ని స్మరించుకుంటూ.. సమాజంలో సాంప్రదాయ విలువలను ఆధునిక పద్ధతుల్లో విస్తరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు. నూతన తరాన్ని సాంప్రదాయాల వైపు మళ్లించడానికి ఇది సరైన మార్గమని మద్దతుదారులు పేర్కొంటుండగా.. పవిత్రమైన ఆధ్యాత్మిక పద్ధతులను క్లబ్ కల్చర్ గా మార్చి వాణిజ్యమయం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.














Click it and Unblock the Notifications
