భారత్‌లో సిరీస్ ఆడుతుండగానే బిగ్ షాక్.. ఆ ఆటగాళ్లకు భారీ కోత!

ప్రస్తుతం మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఊహించని షాకిచ్చింది. ఆర్థిక సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ రిటైనర్ ఫీజుల్లో ఏకంగా 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అక్టోబర్ 2026 నుంచి సెప్టెంబర్ 2027 వరకు అమలులో ఉండనుంది. ఈ ప్రతికూల పరిణామాలు భారత్‌తో జరిగే సిరీస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

సడన్ గా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్
సడన్ గా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్

అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు డొమెస్టిక్ క్రికెటర్లపై కూడా ఈ ఆర్థిక భారం పడింది. డొమెస్టిక్ ఆటగాళ్ల కాంట్రాక్టు కాలపరిమితిని గతంలో ఉన్న 12 నెలల నుంచి కేవలం 7 నెలలకు అంటే అక్టోబర్ 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు కుదించారు. బోర్డు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని క్రికెట్ వెస్టిండీస్ స్పష్టం చేసింది.

West Indies Cricket Crisis CWI slashes player pay by 25 amid financial loss during their India tour

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గత కొద్దికాలంగా తీవ్ర ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది. సెప్టెంబర్ 2025తో ముగిసి ఆర్థిక సంవత్సరంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఏకంగా 28 మిలియన్ డాలర్ల నికర నష్టాన్ని నమోదు చేయగా.. సెప్టెంబర్ 2026 నాటికి మరో 26 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. అంతే కాకుండా బోర్డు నిర్వహణ కోసం జులైలోనే ఐసీసీ నుంచి 12.82 మిలియన్ డాలర్ల అత్యవసరం రుణం పొందడం వారి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. సంస్థను రక్షించుకోవడానికి ఈ చర్యలు తప్పనిసరి అని సీఈవో క్రిస్ డెహ్రింగ్ వివరించారు.

వాతావరణంలో ఊహించని మార్పు.. సగం దేశాన్ని కమ్మిన మేఘాలు
వాతావరణంలో ఊహించని మార్పు.. సగం దేశాన్ని కమ్మిన మేఘాలు

ఖర్చులను మరింత తగ్గించుకునే క్రమంలో ఈ ఏడాది జరగాల్సిన పురుషుల 'సూపర్ 50' వన్డే టోర్నీతో పాటు మహిళల 'టీ20 బ్లేజ్' పోటీలను బోర్డు వాయిదా వేసింది. ఆటగాళ్ల, సిబ్బంది జీతాలు, ప్రయాణ, వసతి ఖర్చులు భరించడం కష్టంగా మారడమే దీనికి కారణం. అయితే ఈ టోర్నీల రద్దు వల్ల 2027 వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్‌కు సిద్ధమవుతున్న వెస్టిండీస్ జట్టు సన్నాహకాలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా నవంబర్లో ఇంగ్లాండ్ 'ఏ' జట్టుతో వైట్-బాల్ మ్యాచ్‌లు ఆ తర్వాత వన్డే క్యాంప్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ కొత్త వ్యూహాన్ని అమలు చేయనుంది. కరేబియన్ పరిధిలోని విభిన్న దేశాలు ఒలింపిక్స్ లేదా పాన్ అమెరికన్ గేమ్స్‌లో స్వతంత్రంగా పోటీ పడే అవకాశం ఉండటంతో ప్రత్యేక క్వాలిఫికేషన్ టోర్నమెంట్లను నిర్వహించనున్నారు. అయితే ఈ టోర్నీల ఖర్చులను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కాకుండా ఆయా దేశాల క్రికెట్ సంఘాలు, జాతీయ ఒలింపిక్ కమిటీలు, ప్రైవేట్ భాగస్వాములు భరించేలా కొత్త నమూనాను రూపొందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+