ఉగ్రవాదాన్ని కలిసి అంతం చేద్దాం: భారత్ కు సింగపూర్ అండ
న్యూఢిల్లీ: రోజురోజుకు పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో సహాయ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి, సీమాంతర ఉగ్రవాదం, మత ఛాందసవాదం రెండు దేశాలకు పెను సవాళ్లని భారత్ పేర్కొంది.

భారత పర్యటనలో ఉన్న సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పెట్టుబడులు, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాల ప్రధాన మంత్రులు నిర్ణయించారు. వివిద అంశాలపై సుదీర్ఘంగా వీరు చర్చించారు.
అనంతరం మోడీ, లీ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదం, మత ఛాందసవాదం మన భద్రతకు, సమాజానికి పెను సవాళ్లు రువ్వుతున్నాయని మోడీ అన్నారు. శాంతి మానవత్వంపై విశ్వాసం ఉన్న వారు ఈ బెడదను ఎదుర్కొనే విషయంలో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సముద్ర మార్గాలు తెరిచి ఉంచడం, సాగరాల విషయంలో అంతర్జాతీయ న్యాయ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఇరు దేశాలు నిర్ణయించాయని మోడీ వివరించారు. ముఖ్యంగా ఉగ్రవాద నిర్మూలణకు సింగపూర్ పూర్తి సహకారం ఇస్తానని హామీ ఇచ్చిందని నరేంద్ర మోడీ వివరించారు.

ప్రపంచం రేపు చేయబోయే పనులను సింగపూర్ నేడే చేసి చూపిస్తుందని నరేంద్ర మోడి పేర్కొన్నారు. ఊరీ ఉగ్రదాడిని సింగపూర్ ప్రధాని లీ ఖండించారు. ఉరీ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

భారత్ -సింగపూర్ దేశాల మధ్య ఉన్న ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేసే అంశంపై చర్చించామని వివరించారు. భారత్ అభివృకి సాధ్యమైనన్ని చోట్ల తోడ్పాటు అంధిస్తామని లీ చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ కు పూర్తి సహకారం అంధిస్తామని సింగపూర్ ప్రధాని లీ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications