వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ప్రధాని షరీఫ్ తల్లికి మోడీ పాదాభివందనం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాక్‌లో ఆకస్మిక పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోడీకి అపూర్వ స్వాగతం, ఆతిథ్యం లభించింది. పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్, మోడీ కోసం ప్రత్యేక వంటకాలను తయారు చేయించారు. శుక్రవారం సాయంత్రం లాహోర్‌ నగర శివారు రాయ్‌విండ్‌‌లోని నవాజ్ షరిఫ్‌కు చెందిన జతీ ఉమ్రాహ్ ప్యాలెస్‌కు ప్రధాని మోడీ వెళ్లారు.

పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ కొడుకు హాసన్, ఇతర కుటుంబ సభ్యులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. షరీఫ్ తన కుటుంబ సభ్యులను మోడీకి పరిచయం చేశారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని తల్లి అక్కడికి రాగా మోడీ ఆమెకు పాదాభివందనం చేసినట్లు పాక్ వర్గాలు తెలిపాయి.

PM Narendra Modi touches Nawaz Sharif's mother's feet, makes surprise visit to Pakistan

పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ తన నివాసంలో మోడీకి ఏర్పాటు చేసిన విందులో ఆయనకు ఇష్టమైన పాలకూరతో పాటు సాగ్, దాల్, శాకాహార వంటకాలను వండించారు. ప్రధాని మోడీకి ప్రత్యేకంగా కశ్మీరీ టీ అందజేశారు. శుక్రవారం షరిఫ్ పుట్టిన రోజుతో పాటు ఆయన మనవరాలు మొహ్రున్నిసా వివాహం కావడంతో మనవరాలికి మోడీ తన ఆశీస్సులను తెలిపారు.

ముందుగా లాహోర్ వెళ్లిన మోడీకి విమానాశ్రయంలో నవాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఇద్దరూ ప్రత్యేక హెలికాప్టర్‌లో లాహర్‌లోని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లారు. షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ, అనంతరం లాహోర్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు.

తెలుగు వన్ఇండియా

English summary
Prime Minister Narendra Modi on Friday met the family members of his Pakistani counterpart Nawaz Sharif and touched the feet of his mother Shamim Akhtar at latter's residence Raiwind Palace, the ancestral home of 'The Sharifs'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X