ప్రధాని నరేంద్ర మోడీ వేసుకున్న జాకెట్ ప్రత్యేకత ఇదే

టోక్యో: జపాన్‌లో జరుగుతున్న జీ7 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ వేసుకున్న స్లీవ్‌లెస్ జాకెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే ఇది రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేసిన స్లీవ్‌లెస్ జాకెట్‌ కావడం గమనార్హం. 'సుస్థిరత సందేశంలో ఈ రోజు జపాన్‌లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేసిన జాకెట్‌ను ధరించారు' అని ఒక అధికారి తెలిపారు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో 1945లో జపాన్‌లోని ఈ నగరంపై అమెరికా అణుబాంబు దాడిలో మరణించిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

PM Narendra Modi Wears Jacket Made of Recycled Material During Visit to Hiroshima Museum

హిరోషిమాలో జరుగుతున్న జీ7 అడ్వాన్స్‌డ్ ఎకానమీల వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ జపాన్‌లో పర్యటించారు. మ్యూజియాన్ని సందర్శించేందుకు ప్రధాన మంత్రి జి7 సదస్సులో ఇతర ప్రపంచ నేతలతో కలిసి పాల్గొన్నారు. మ్యూజియంలోని సందర్శకుల పుస్తకంపై ప్రధాని సంతకం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆదివారం ఉదయం హిరోషిమాలోని పీస్ మెమోరియల్ మ్యూజియం, హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్‌కు వెళ్లాను' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అణుబాంబు మృతుల చిత్రపటానికి నాయకులు సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమెరికా.. ఆగష్టు 6, 1945న హిరోషిమాపై ప్రపంచంలోని మొట్టమొదటి అణు దాడిని నిర్వహించింది. ఈ దాడి నగరాన్ని నాశనం చేసింది, దాదాపు 1,40,000 మందిని బలితీసుకుంది.

ఈ స్మారక ప్రదేశంలోని మ్యూజియాన్ని సందర్శించిన మోడీ ఫోటోలను ట్వీట్ చేస్తూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నారు. ' ప్రధాని నరేంద్ర మోడీ శాంతి స్మారక మ్యూజియాన్ని సందర్శించి, హిరోషిమా బాధితుల జ్ఞాపకార్థం నివాళులర్పించారు. ఆయన డాక్యుమెంట్ చేయబడిన వాటిని పరిశీలించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారని తెలిపారు.

G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రపంచ నాయకుల గ్రూప్ ఫోటోను కూడా మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ' ప్రపంచ నాయకులు హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్‌లో కూడా తమ నివాళులర్పించారు' తెలిపింది. ఈ సౌకర్యం బాధితులు వదిలిపెట్టిన వస్తువులు, ఫోటోలు, హిరోషిమాపై యూఎస్ అణు బాంబు వేసిన భయానకతను తెలియజేసే ఇతర వస్తువులను ప్రదర్శిస్తుంది. జీ7 కూటమిలో జపాన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ అలాగే యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+