విద్యార్థులకు మద్యాహ్నం బోజనం, సాంబార్ లో విషం కలిపేశారు, క్లైమాక్స్ లో ?
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో కస్తూరి బా రెసిడెన్షియల్ పాఠశాలలో మధ్యాహ్నం వేడి వేడి సాంబారు తిని వంట గదిలోని వంట చేసే అసిస్టెంట్ తీవ్ర అస్వస్థతకు గురైంది. సాంబారులో విషం కలిపి పాఠశాల విద్యార్థులకు మద్యాహ్నం భోజనంలో అదే సాంబర్ వడ్డించడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. అయితే సాంబారు తిని అస్వస్థతకు గురైన వంట చేసే సహాయకురాలు విజయలక్ష్మి అదృష్టవశాత్తూ బతికిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మద్యాహ్నం విద్యార్థులు ఎవరూ భోజనం చేయకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు అంటున్నారు. స్కూల్ లో మద్యాహ్నం భోజనం సిద్ధం చేశారు. అయితే సాంబార్ రంగు మారినట్లు వంట గది అసిస్టెంట్ విజయలక్ష్మి గమనించింది. ఇలా పిల్లలకు భోజనం వడ్డించే ముందు సహాయకురాలు విజయలక్ష్మి స్వయంగా భోజనంలో సాంబారు కలుపుకుని తిని పరీక్షించింది. సాంబర్ తిన్న తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.

వంట గది అసిస్టెంట్‌ని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు యధావిధిగా భోజనం చేసి ఉంటే మా పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆ స్కూల్ సిబ్బందిని నిలదీశారు.విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మధ్యాహ్నం భోజనం తయారు చేసిన బియ్యం, వంట సామాగ్రిని సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.
ఈ ఘటనపై జలహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.వ్యక్తిగత గొడవల కారణంగా కొన్నాళ్ల క్రితం వంట మనిషి, వార్డెన్, టీచర్ల మధ్య గొడవ జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బందికి ముకుతాడు వేసిన విద్యార్థుల కుటుంబ సభ్యులు అందరికి బుద్దిమాటలు చెప్పారని తెలిసింది. హెడ్ మాస్టర్ సెలవుపై వెళ్లిన రోజునే సాంబారులో విషం కలిపి విద్యార్థులకు వడ్డించడానికి ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. సాంబర్ స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు పంపించిన పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. వ్యక్తిగత గొడవల కారణంగా విద్యార్థులకు భోజనంతో పాటు విషం కలిపిన సాంబర్ వడ్డించాలని ప్రయత్నించడం కలకలం రేపుతోంది.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications