చిక్కుల్లో నటి రమ్య: క్రిమినల్ కేసు నమోదు (ఫోటోలు)
మంగళూరు/బెంగళూరు: బహుబాష నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రమ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆర్ఎస్ఎస్ నాయకులు బ్రిటీష్ వారికి సహకరించారని వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో ఆమె మరో కేసులో చిక్కుకున్నారు.
రమ్య మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని మంగళూరు సమీపంలోని బెళ్తంగడి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వారికి సహకరించిందని రమ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సమాజాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తూ వసంత్ మరకడ అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.

పోలీసులు పట్టించుకోలేదు
మొదట న్యాయవాది వసంత్ రమ్య మీద కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చెయ్యడానికి నిరాకరించారు.

కోర్టును ఆశ్రయించిన న్యాయవాది
రమ్య మీద కేసు నమోదు చెయ్యడానికి పోలీసులు నిరాకరించారని, అందుకే ఇక్కడ ప్రయివేటు కేసు వేస్తున్నానని న్యాయవాది వసంత్ న్యాయస్థానంలో చెప్పారు.

స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న కోర్టు
న్యాయవాది వసంత్ స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసుకుంది. ఆయన వాదన పూర్తిగా విన్న న్యాయస్థానం రమ్య మీద కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమ్య
మండ్యలో విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన ర్యాలీలో రమ్య పాల్గోన్నారు. ఆర్ఎస్ఎస్ వలన దేశానికి స్వాతంత్రం రాలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తేనే స్వాతంత్రం వచ్చిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరో సారి బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్
రమ్య మరో సారి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వారికి పూర్తిగా సహకరించారని విద్యార్థుల నిర్వహించిన ర్యాలీలో చెప్పారు.

ఇప్పటికే కేసు నమోదు
రమ్య మీద ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయ్యడంతో రమ్య మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు.

దేశ ద్రోహం కేసు పెట్టారు
శత్రుదేశం అయిన పాకిస్థాన్ కు కితాబు ఇస్తూ అక్కడి ప్రజలు చాల మంచి వారని రమ్య చెప్పిన విషయం తెలిసిందే. విఠల్ గౌడ అనే న్యాయవాది కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని సోమవారపేట జేఎంఎఫ్ సీ కోర్టులో రమ్య దేశద్రోహం చేసిందని ప్రయివేటు కేసు పెట్టారు.












Click it and Unblock the Notifications