బెంగళూర్ రేప్: నిరసన, చెలరేగిన హింస (పిక్చర్స్)
బెంగళూర్: విబ్జియార్ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో బెంగళూర్ నగరం అట్టుడుకుతోంది. బిజెపి నగరవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టింది. బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.
ఆందోళనను అదుపు చేయడానికి పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎబివిపి విద్యార్థులు బారికేడ్లను ఛేదించి ముందుకు దూకడంతో హింస చెలరేగింది. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. ఈ సంఘటన సోమవారంనాడు జరిగింది.
ఎబివిపి కార్యకర్తలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దయెత్తున పాఠశాల వద్ద గుమిగూడారు. ఈ సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జికి దిగారు.

నిరసన ఇలా..
ఆరేళ్ల బాలికపై అత్యాచరం జరిగిన ఘటనపై ఎబివిపి కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో మహిళలు కూడా పాల్గొన్నారు.

శాంతియుతంగా నిరసన..
తాము శాంతియుతంగా నిరసన తెలుపుతూ పాఠశాల యజమానులు బయటకు వచ్చి చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని అడిగామని, అయితే పోలీసులు దౌర్జన్యానికి దిగారని ఎబివిపి నాయకులు ఆరోపించారు.

మహిళలని కూడా చూడకుండా..
ఆందోళన చేస్తున్న మహిళలను కూడా పోలీసులు వదిలిపెట్టలేదని, మహిళా పోలీసులు లేకుండా ఆ పనిచేశారని వారు ఆరోపించారు.

లాఠీచార్జీ ఇలా...
ఆందోళనకారులు బారికేడ్లను ఛేదించడంతో పోలీసులు లాఠీచార్జీకి పూనుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఎవరినీ తోయలేదు..
తాము ఎవరినీ తోసివేయలేదని, ఎవరిపై కూడా చేయి చేసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. వారిని అదుపు చేయడానికి మాత్రమే ప్రయత్నించామని పోలీసులు చెప్పారు.

భారీగా పోలీసుల మోహరింపు
విబ్జియార్ పాఠశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డారు.

బిజెపి నిరనస
ఆరేళ్ల బాలికపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ బిజెపి కూడా పెద్ద యెత్తున ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా పాల్గొన్నారు












Click it and Unblock the Notifications