పహల్గామ్ దాడి వెనుక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. కర్త, కర్మ మొత్తం ఆమె
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కాస్త సద్దుమణుగుతున్న తరుణంలో, జ్యోతి మల్హోత్రా అనే మహిళ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హర్యానాలో పుట్టి, పాకిస్థాన్ గూఢచారిగా మారిన ఆమె కథ వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, తన మాటలతో, అందాలతో లక్షలాది మందిని ఆకర్షించిన జ్యోతి మల్హోత్రా అసలు ముఖం 2023లో పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడే బయటపడింది. అక్కడ ISI ఏజెంట్ డానిష్‌తో పరిచయం ప్రేమగా మారి, చివరకు దేశద్రోహానికి దారితీసింది.

యూట్యూబర్ ముసుగులో భారత సైనిక స్థావరాలను చిత్రీకరించి, మన దేశ రహస్యాలను పక్కాగా డానిష్‌కు చేరవేసింది. చివరికి 2024లో హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లో సంచరిస్తూ సైనికుల కదలికలను చేరవేస్తుండగా అనుమానం వచ్చి అరెస్టయ్యింది. ఆమె ఫోన్ పరిశీలించగా టెర్రరిస్టులతో సంబంధాలున్నట్లు నిర్ధారణ అయింది.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన కొన్ని కొత్త కోణాలు పోలీసులు దర్యాప్తులో భాగంగా బయటపెట్టారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి కేవలం రెండు నెలల ముందు, జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లో పర్యటించినట్లు పోలీసులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఒక వీడియోలో మల్హోత్రా లాహోర్‌లోని ఒక రెస్టారెంట్‌లో కొంతమంది వ్యక్తులతో కలిసి భోజనం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఆమెతో పాటు ఉన్న ఆ వ్యక్తులు ఎవరు అనే విషయంపై పోలీసులు ఇంకా స్పష్టతనివ్వలేదు.
మరియం నవాజ్‌తో ఫొటో - తీవ్రమవుతున్న అనుమానాలు
అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, మరొక ఫొటోలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్న మరియం నవాజ్ షరీఫ్‌తో కలిసి కనిపించింది. ఈ ఫొటో ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పాక్ లోని ఒక రాజకీయ నాయకురాలితో, అదీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారితో జ్యోతి మల్హోత్రాకు ఉన్న పరిచయంపై పోలీసులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ జ్యోతి మల్హోత్రాపై ఉన్న గూఢచర్యం ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో ఆమె పాకిస్థాన్ పర్యటనకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు అధికారులు లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications