బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Political war: మాజీ సీఎం మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన ఎమ్మెల్సీ, కులం పేరుతో దూషించారని !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య మీద ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు నమోదు చెయ్యాలని పోలీసు కేసు పెట్టారు. మాజీ సీఎం సిద్దరామయ్య మీద సాదాసీదా వ్యక్తి కేసు పెట్టలేదు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్సీగా విజయం సాధించిన చలవాది నారాయణస్వామి తనను మాజీ సీఎం సిద్దరామయ్య కులం పేరుతో దూషించాడని, దళితులకు ఆయన ఎప్పుడు విలువ ఇవ్వలేదని పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

Illegal affair: ప్రియుడి మోజులో పడిన భార్య, భర్తకు చిన్నగాయం కాకుండా నిద్రలోనే చంపేసిన భార్య, స్కెచ్ !Illegal affair: ప్రియుడి మోజులో పడిన భార్య, భర్తకు చిన్నగాయం కాకుండా నిద్రలోనే చంపేసిన భార్య, స్కెచ్ !

 బీజేపీ ఎమ్మెల్సీ

బీజేపీ ఎమ్మెల్సీ

ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నాయకుడు చలవాది నారాయణస్వామి ఎమ్మెల్సీ టిక్కెట్ సంపాధించి విజయం సాధించారు. శుక్రవారం బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి మాజీ సీఎం సిద్దరామయ్య మీద ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

 కులం పేరుతో తనను మాజీ సీఎం దూషించారు

కులం పేరుతో తనను మాజీ సీఎం దూషించారు

మాజీ సీఎం సిద్దరామయ్య మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన తరువాత బీజేపీ ఎమ్మెల్సీ పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చలవాది నారాయణస్వామి అన్నారు. అయితే తనను కులం పేరుతో దూషించారని, దళితుడు అని అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు.

 మాజీ సీఎంను అరెస్టు చెయ్యకుంటే ధర్నాలు చేస్తా

మాజీ సీఎంను అరెస్టు చెయ్యకుంటే ధర్నాలు చేస్తా

తనను కులం పేరుతో దూషించడమే కాకుండా దళితులను అవమానించారని, అందుకే ఆ విషయం జీర్ణించుకోలేక తాను కేసు పెట్టవలసి వచ్చిందని చలవాది నారాయణస్వామి అన్నారు. సిద్దరామయ్యను అరెస్టు చెయ్యడంలో పోలీసులు ఆలస్యం చేస్తే తాను నిరాహారదీక్షకు దిగి ధర్నా చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి మీడియాకు చెప్పారు.

త పార్టీ లేడీ లీడర్ ఏం చెప్పారంటే ?

త పార్టీ లేడీ లీడర్ ఏం చెప్పారంటే ?

సొం

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి, దళితురాలు మోటమ్మకూడా తన ఎదుగుదలకు మాజీ సీఎం సిద్దరామయ్య అడ్డుపడ్డారని ఆమె ఆత్మకథలో రాశారని, మోటమ్మ విషయంలో, నా విషయంలో సిద్దరామయ్య తీరు గమనిస్తే ఆయన దళితులకు మర్యాద ఇవ్వరని అర్థం అవుతోందని బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి అన్నారు. మొత్తం మీద మాజీ సీఎం మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడం ఇప్పుడు కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.

English summary
Political war: BJP MLC Chalavadi Narayanaswamy police complaint against former CM and Congress leader Siddaramaiah for caste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X