హర్యానాలో ముగిసిన పోలింగ్: ఓటింగ్ శాతం ఎంతంటే?

ఛండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన 1031 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. శనివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌లకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదు కాగా, 6 గంటల వరకు 65 శాతానికి ఓటింగ్ చేరినట్లు సమాచారం.

భారత ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. మేవాత్ 68.28% ఓటింగ్‌తో ముందంజలో ఉండగా, సాయంత్రం 5 గంటల సమయానికి గురుగ్రామ్‌లో అత్యల్పంగా 49.97% నమోదైంది. యమునానగర్‌లో 67.93%, పల్వాల్‌లో 67.69%, ఫతేహాబాద్‌లో 67.05%, జింద్‌లో 66.02%, మహేంద్రగఢ్‌లో 65.76%, కురుక్షేత్రలో 65.55%, సిర్సాలో 65.37% పోలింగ్ నమోదైంది.

Polling ends in Haryana 65 percent voter turnout

హిసార్‌లో 64.16%, భివానీ వద్ద 63.06%, కైతాల్ వద్ద 62.53%, అంబాలా వద్ద 62.26%, రేవారి వద్ద 60.91%, పానిపట్ వద్ద 60.52%, ఝజ్జర్ వద్ద 60.52%, 60.52% వద్ద కర్నాల్ వద్ద 60.52% 60.42%, చర్ఖీ దాద్రి 58.10%, సోనిపట్ 56.69%, ఫరీదాబాద్ 51.28%, పంచకుల 54.71% ఓటింగ్ నమోదైంది.

ప్యారిస్ ఒలింపిక్స్ డబుల్ పతక విజేతలు స్టార్ షూటర్ మను బాకర్, హర్యానా సీఎం, బీజేపీ అభ్యర్థి నాయబ్ సింగ్ సైనీ, కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కృషణ్ పాల్ గుల్జార్, గుజరాత్ గవర్నర్, ప్రొఫెసర్ దేవవ్రత్, మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫోగట్, మాజీ డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా, భారత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియగించుకున్నారు.

కాగా, పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అయితే, దీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతోపాటు కుల సమీకరణలు ఆ పార్టీకి ఈసారి ప్రతికూలంగా మారే అవకాశాన్నట్లు తెలుస్తోంది. జాట్, ఎస్సీల మద్దతు కూడగట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఆ రెండు వర్గాలు అండగా నిలుస్తుండటంతో ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగా మారింది.

పోలింగ్ పూర్తవడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా వేశాయి. అయితే, అక్టోబర్ 8న వచ్చే అసలైన ఫలితాలు కోసం వేచిచూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+