యూపీలో ఇక కులాలు నడవవు. అభివృద్ధి హైవేలపైకి వెళ్లాలని ప్రజల కోరిక: ప్రధాని మోడీ

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అన్ని పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని బల్లియాలో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు రెండు రౌండ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బల్లియా చేరుకున్నారు.

కాగా, కులతత్వం గురించి మాట్లాడటం ద్వారా ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రం ఇకపై కులంతో నడపబడదు. "ఇది అభివృద్ధి హైవేలపైకి వెళ్లాలని కోరుకుంటుంది' అని ప్రధాని అన్నారు. ప్రత్యర్థి పార్టీలను హేళన చేస్తూ ప్రధాని మోడీ.. "5 దశల యూపీ ఎన్నికలలో, రాష్ట్ర ప్రజలు రాజవంశ రాజకీయాలను తిరస్కరించారు. యూపీ వాహనం ఇకపై కుల వీధుల్లో చిక్కుకోబోదని సందేశం ఇచ్చారు. అభివృద్ధి రహదారిపై ఊపందుకుంది" అని వ్యాఖ్యానించారు.

Polls: UP No Longer Wants To Be Driven By Casteism: PM Modi

'ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే ఉజ్వల పథకం ఇక్కడ నుంచి ప్రారంభించబడినందున బల్లియాతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. యూపీ అభివృద్ధి నా బాధ్యత, ప్రాధాన్యత. యోగి ప్రభుత్వంలో.. బల్లియాలోని ఒక వ్యాపారి తన డబ్బు దొంగిలించబడుతుందనే భయం లేదు' అని ప్రధాని మోడీ అన్నారు.

ప్రధాని మోడీ అంతకుముందు ఆదివారం బస్తీ, బల్లియా, డియోరియా, వారణాసిలో సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ నిన్న సాయంత్రం 6 గంటలకు పూర్తయింది. చివరి రెండు దశల్లో మార్చి 3, మార్చి 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

యూపీ శాసనసభ ఎన్నికలు 2017
యూపీ శాసనసభ ఎన్నికల 2017కి 7 దశల్లో ఓటింగ్ జరిగింది. 61.04% ఓటింగ్ నమోదైంది. మోడీ వేవ్‌లో, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మూడు వంతుల మెజారిటీతో 325 సీట్లు గెలుచుకుంది. అప్పటి ఎస్పీ ప్రభుత్వం 177 స్థానాలను కోల్పోయింది. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 311 సీట్లలో 47 మాత్రమే పొందగలిగింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ రాష్ట్రంలో పోటీ చేసిన 403 స్థానాలకు గానూ 19 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 7 అసెంబ్లీ స్థానాలతో సంతృప్తి పడగా, బీజేపీ మైనర్‌ కూటమి భాగస్వామి అప్నాదళ్‌ పోటీ చేసిన 11 స్థానాల్లో 9 స్థానాలను కైవసం చేసుకోగలిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+