ఢిల్లీని వీడని కాలుష్య మేఘాలు.. తాజా పరిస్థితి ఇలా!!

వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటిగా మారింది. వాయు కాలుష్యం నివారించడానికి ఢిల్లీ సర్కారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక దీపావళి పండుగ సమయంలో వాయు కాలుష్యం మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం నియంత్రించడానికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

దేశ రాజధాని ఢిల్లీ ప్రమాదంలో ఉంది. వాయు కాలుష్యం ఢిల్లీ వాసులను భయపెడుతుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం అరికట్టటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నా అవి ఇప్పటివరకు చెప్పుకోదగిన సత్ఫలితాలను ఇవ్వలేదు. కాలుష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చినా ఫలితం మాత్రం శూన్యం గా ఉంది.

 Pollution danger bells at Delhi.. This is the latest situation!!

కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం వాయు కాలుష్యానికి కారణం అయ్యే వారికి గరిష్ఠంగా ఐదేళ్ల జైలు ఒక కోటి రూపాయల వరకు జరిమానా విధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని పలు నగరాలలోని వాయు నాణ్యత గణనీయంగా తగ్గిపోయింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) అతి తీవ్ర స్థాయి(ఏక్యూఐ: 421)కి చేరింది.

నోయిడాలో అత్యధికంగా ఏక్యూఐ 467గా నమోదైంది. పంజాబీ భాగంలో గాలి నాణ్యత సూచి ఏక్యూఐ 460 కి చేరింది.ఆనంద్ విహార్ లో 452, ఆర్కే పురంలో 433గా గాలి నాణ్యత నమోదయిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పరిస్థితి అధ్వానంగా మారిందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో పాఠశాలలను మూసివేశారు. నవంబర్ 10వరకు స్కూల్స్ మూసివేత కొనసాగుతుంది.

ఉష్ణోగ్రతలు పడిపోతే మరింత కాలుష్యం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ పొల్యూషన్ క్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ వాహనాల సరి, బేసి విధానంపై నిర్ణయం తీసుకున్నారు. bs3 పెట్రోల్, bs4డీజిల్ కార్లపై నిషేధం సైతం కొనసాగుతుందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+