ప్రధాని మోడీ కంటే పాపులర్ అయిన ప్రభాస్ హీరోయిన్!
భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు చాలా గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ప్రధాని నరేంద్ర మోడీ అభిమానులు భారీగానే ఉంటారు. భారత ప్రధానిగా ప్రపంచం పైనే తన మార్కు వేసిన ప్రధాని నరేంద్ర మోడీని ప్రభాస్ హీరోయిన్ దాటిపోయింది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మోడీని దాటేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు కారణం అవుతుంది.
ఇన్ స్టాగ్రామ్ లో ప్రభావవంతమైన వ్యక్తుల్లో మోడీ ఒకరు
సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరైనప్పటికీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది కోహ్లీకే. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ తో కోహ్లీ మొదటి స్థానంలో నిలువగా కోహ్లీ తర్వాత ప్రియాంక చోప్రా 91.8 మిలియన్ల ఫాలోవర్స్ తో ఉన్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో మూడో స్థానంలోకి శ్రద్ధా కపూర్
ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 91.3 మిలియన్ల ఫాలోవర్స్ తో ఉన్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో భారత ప్రధాని మూడవ స్థానంలో ఉన్నారు. ఇక ఈ స్థానాన్ని ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దక్కించుకుంది .91.5 మిలియన్ల ఫాలోయర్స్ తో శ్రద్ధ కపూర్ ప్రస్తుతం మూడవ స్థానంలో నిలబడింది.

ప్రధాని మోడీ ఫాలోవర్స్ ను దాటేసిన శ్రద్ధా కపూర్
శ్రద్ధా కపూర్ ఫాలోవర్స్ సంఖ్య బాగా పెరిగింది. దీంతో ప్రధాని మోడీని ఆమె అధిగమించినట్టయింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ 101.2 మిలియన్ల ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు. ఇక శ్రద్ధ కపూర్ విషయానికి వస్తే ప్రస్తుతం హిందీలో శ్రద్ధ కపూర్ నటించిన స్త్రీ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది.

స్త్రీ 2 సక్సెస్ తో శ్రద్ధా కపూర్ కు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్
ఇక టాలీవుడ్ లో ప్రభాస్ సరసన నటించిన ఈ భామ సాహో మూవీలో హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో టాలీవుడ్ ఆమెకు పెద్దగా కలిసి వచ్చినట్టుగా అనిపించలేదు. ఇక తాజాగా శ్రద్ధ కపూర్ చేసిన స్త్రీ 2 ఐదు రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి దూసుకు వెళుతుంది. ఈ క్రమంలోనే శ్రద్ధా కపూర్ కు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ 91.5 మిలియన్లకు చేరుకున్నారు.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications