వీడియో: ప్రగ్యా ఠాకూర్‌ మళ్లీ చిక్కింది..ఒక ఆటాడుకుంటున్న కాంగ్రెస్

భోపాల్ : బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ ఏది చేసినా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ విమర్శలు సంధించింది. కోర్టుకు హాజరయ్యేందుకు అనారోగ్య కారణాలు చూపిన ప్రగ్యా ఠాకూర్ డ్యాన్స్‌లు మాత్రం ఇరగదీస్తోందంటూ సెటైర్లు వేశారు. తాజాగా మరో వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కరోనా టీకా తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ టీకాను ఆమె తన ఇంట్లో తీసుకుంది.

అయితే వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటికే వచ్చి ప్రభుత్వ యంత్రాంగం టీకాలు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రగ్యా ఠాకూర్‌కు కూడా టీకా తొలి డోసు ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ మాత్రం విమర్శలు సంధించింది. ఎంపీ బాస్కెట్ బాల్ ఆడారు, వివాహ వేడుకలో డ్యాన్స్ వేశారు అంతా బాగానే ఉన్నప్పుడు ఇంటికి సిబ్బందిని పిలిపించుకుని టీకా తీసుకోవడమేంటంటూ ప్రశ్నించింది కాంగ్రెస్. ప్రధాని మోదీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు అంతా హాస్పిటల్‌కు వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటుండగా.. ప్రగ్యా ఠాకూర్‌ మాత్రం సిబ్బందిని ఇంటికి పిలిపించుకుని టీకా వేయించుకుంటున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలూజా.

Pragya Thakur takes covid shot at her residence, once again becomes a target for congress

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌లో టీకా వేయించుకునేందుకు టీకా కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో బెయిల్‌పై విడుదలైన ప్రగ్యా ఠాకూర్ తన అనారోగ్య కారణంగా కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపైనే ప్రత్యర్థులు మాటలతూటాలు పేల్చుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అబద్దాలు చెప్పి కోర్టుకు హాజరుకాకుండా ప్రగ్యా తప్పించుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతనెల బాస్కెట్ బాల్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కిన ఈ కమలం పార్టీ ఎంపీ... కొద్ది రోజుల క్రితం ఓ వెడ్డింగ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు.2008లో జరిగిన మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపిన ప్రగ్యా ఠాకూర్‌ 2017లో బెయిల్‌ పై విడుదలయ్యారు. ఆ పేలుళ్ల ఘటనలో ఆరుగురు మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. మోటార్‌సైకిల్‌లో బాంబును అమర్చి ఆ మోటార్ సైకిల్‌ను ఓ మసీదుకు సమీపంలో వదలి వెళ్లారు.

ఈ ఏడాది జనవరిలో తన కోర్టు హాజరకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై, ముంబై కోర్టు ఆరోగ్యపరమైన అంశాన్ని పరిగణలోకి తీసుకుని కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+