ఇండియా vs భారత్: మీరు పేరు మాత్రమే మార్చగలరు.. కానీ: ప్రకాష్ రాజ్ సంచలనం!!
ప్రస్తుతం దేశంలో ఇండియా పేరును భారత్ గా మారుస్తున్నారా అన్నది ప్రధాన చర్చగా మారింది. ఇండియా, భారత్ రెండు పేర్లకు బదులుగా ఒకే పేరు తీసుకురావాలనే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉన్నట్టు ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇప్పటివరకు అనేక నగరాల పేర్లను మార్చగా, ప్రస్తుతం ఇండియా పేరును భారత్ గా మారుస్తారు అని కూడా ప్రధాన చర్చ జరుగుతుంది.
అందుకు ఊతమిస్తూ జీ 20 సదస్సుకు తరలివస్తున్న ప్రపంచ దేశాల అధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ద్రౌపది ముర్ము, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ ఇన్విటేషన్ లు పంపించారు. అయితే ఇండియా పేరును భారత్ గా మార్చడం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఈ నిర్ణయం తప్పని అంటున్నారు.

కొందరు ఇండియా, భారత్ రెండు చలామణిలో ఉన్న పేర్లే అని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఇండియా పేరును భారత్ గా మార్చడం పట్ల, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి అని, ఇది మంచి పరిణామమని ఉంటున్నారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా లేకపోలేదు.
తాజాగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై స్పందించారు. మీరు తలుచుకుంటే కేవలం దేశం పేరును మాత్రమే మార్చగలరు అంటూ బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్ కానీ అదే మేము తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని మార్చగలమని వ్యాఖ్యలు చేశారు.
ఆయన దేశ ప్రజలను మేము అనే అర్థంలో ఉపయోగించారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదటి నుంచి బిజెపి ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలను ప్రకాష్ రాజ్ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఇక తాజాగా ఇండియా పేరును భారత్ గా మార్చాలనే ఆలోచన పట్ల ఆయన బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్పందించారు.












Click it and Unblock the Notifications