నా ఓటు హక్కు తొలగించారు.. గేమ్ ఆన్: ప్రకాశ్ రాజ్ సంచలనం
SIR ప్రక్రియలో భాగంగా ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు గల్లంతైంది. తన సొంత నియోజకవర్గంలో ఓటు గల్లంతు కావడంపై ప్రకాశ్ రాజ్ ఫైర్ అయ్యారు. గతంలో ఎంపీ క్యాండిడేట్ అయిన తన ఓటు ఎలా పోయిందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓటర్లలో నేను ఒకర్ని. ఇక్కడే పుట్టి పెరిగాను. ఎంపీగా కూడా పోటీ చేశాను. ఏయే పేపర్స్ అడుగుతారో చూద్దాం. మోదీ.. గేమ్ ఆన్. మీకు ఓటు వేయనివారిని తొలగించే అధికారం మీ వద్ద ఉండొచ్చు. కానీ మిమ్మల్ని గద్దె దింపకుండా మమ్మల్ని ఆపగలరా?' అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.
"ప్రియమైన మిత్రులారా.. మీతో ఒక జోక్ ను పంచుకోవాలనుకుంటున్నాను. బెంగళూరు నియోజకవర్గంలో SIR ప్రక్రియ తర్వాత ఓటు హక్కు తొలగించిన 65 లక్షల మంది ఓటర్లలో నేను కూడా ఒకడిని. ఇది జోక్ కదా? నేను ఇదే నియోజకవర్గంలో పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను. నా థియేటర్, నా కళ అంతా ఇక్కడే సాగింది. మీ సమాచారం కోసం చెబుతున్నాను. నేను ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. సరే, జోక్ బానే ఉంది. అసలు నా ఓటు హక్కును తిరిగి పొందడానికి నేను దాటాల్సిన ప్రక్రియ ఏంటో..

ఏమేం కాగితాలు చూపించాలో చూద్దాం. సరే.. గేమ్ ఆన్.. కానీ ఒక్క చిన్న విషయం. మిమ్మల్ని ఎన్నుకోని పౌరుల ఓటు హక్కును కాలరాయడానికి మీరు మీ అధికారాలను ఉపయోగించవచ్చు. కానీ మిమ్మల్ని గద్దె దించాలనే మా అధికారాన్ని, మా ప్రయత్నాన్ని మీరు ఆపగలరా.. జస్ట్ అస్కింగ్.." అంటూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సెటైరికల్ గా వీడియోలో మాట్లాడారు.
Fraand 😂😂 you may chose n deny voting rights of few citizens who may not elect you back to thrown.. but can you stop us from eventually bringing you down from your thrown #justasking pic.twitter.com/S8BpM3CNy0
— Prakash Raj (@prakashraaj) August 11, 2026
ప్రకాశ్ రాజ్ గత ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే జార్ఖండ్ లో పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని ఆయన తప్పుబట్టారు. విద్యార్థులపై టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలా ఎందుకు చేస్తున్నారని.. క్రూరత్వం అన్ని వేళలా పనిచేయదని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications