నెలకు రూ.80 వేల జీతంతో ప్రసార భారతిలో ఉద్యోగాలు..!
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి (Public Service Broadcaster of India) నిరుద్యోగ అభ్యర్థులకు తీపి కబురు ప్రకటించింది. పలు విభాగాల్లో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ, డిగ్రీ, డిప్లొమా, సీఏ, సీఎంఏ పాసైన వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆలస్యం చేయకుండా తక్షణమే అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు..
50

పోస్టుల వివరాలు..
కంటెంట్ మేనేజర్ (సోర్సింగ్) - 01
కంటెంట్ మేనేజర్ (ఆపరేషన్స్) - 02
కంటెంట్ మేనేజర్ (ప్రొడక్షన్) - 02
క్రియేటివ్ డిజైనర్ - 01
గ్రాఫిక్ ఎడిటర్ - 04
వీడియో ఎడిటర్ - 04
కంటెంట్ ఎగ్జిక్యూటివ్ - 25
లైబ్రరీ అసిస్టెంట్ - 02
ఐటి ఎగ్జిక్యూటివ్ - 03
జూనియర్ మేనేజర్ (డిస్ట్రిబ్యూషన్) - 01
మేనేజర్ (మార్కెటింగ్ & సేల్స్) - 01
జూనియర్ మేనేజర్ (మార్కెటింగ్ & సేల్స్) - 02
ఫైనాన్స్ ప్లానర్ (అకౌంట్స్ - సీఏ/సీఎంఏ) - 01
ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్ & అకౌంట్స్) - 01
విద్యార్హతలు..
పోస్టును బట్టి డిప్లొమా / గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ / సీఏ / సీఎంఏ ఉత్తీర్ణత అవసరం. కొన్నిపోస్టులకు సంబంధిత ఫీల్డ్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.
వయస్సు పరిమితి..
ఐటి ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ పోస్టులు - గరిష్ట వయస్సు 40 ఏళ్లు.
ఇతర పోస్టులు - గరిష్ట వయస్సు 45 ఏళ్లు.
వేతనం..
ఎంపికైన వారికి పోస్ట్‌ను బట్టి రూ.40,000 నుంచి రూ.80,000 వరకు నెల జీతం ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం..
అభ్యర్థులను ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందుతుంది.
దరఖాస్తు గడువు..
10 సెప్టెంబర్ 2025 నుంచి 25 సెప్టెంబర్ 2025 వరకు
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులకు సూచనలు..
దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవాలి.
ఒకేసారి ఒకదాని కంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉంటే వేరువేరుగా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్‌లో తప్పులు చేస్తే తిరస్కరించబడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం స్కాన్ కాపీలు సిద్ధం చేసుకోవాలి.












Click it and Unblock the Notifications