ప్రశాంత్ కిశోర్ కు సుప్రీంకోర్టు చీవాట్లు

మాజీ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటీసన్ విచారణ సందర్భంగా చేదు అనుభవాన్ని చవి చూశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనను తిరస్కరించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని న్యాయమూర్తులు హితబోధ చేశారు. అయినా తన ప్రాచుర్యం కోసం సుప్రీంకోర్టు వంటి న్యాయవేదికలను వాడుకోవాలనుకోవడం సరికాదని అన్నారు.

గత ఏడాది బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ ఈ పిటీషన్ ను దాఖలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సజావుగా వెలువడలేదని, పోలింగ్ ప్రక్రియ చట్టబద్ధంగా జరగలేదని ప్రశాంత్ కిశోర్ ఈ పిటీషన్ లో పొందుపరిచారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక అప్పటి ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన ద్వారా మహిళా లబ్ధిదారులకు రూ. 10,000 బదిలీ చేసిందని అన్నారు. దీన్ని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా అభివర్ణించారు.

Prashant Kishore Jan Suraaj Party Stymied in Supreme Court as Dismisses Challenge to 2025 Bihar Vote

ఈ పిటీషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం వద్దకు పిటీషన్ కు విచారణకు రాగానే న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి, కొత్తగా పోలింగ్ నిర్వహించాలనే అభ్యర్థనను తోసిపుచ్చారు.

"మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన తర్వాత, ప్రజల్లో మళ్లీ తమ ప్రాచుర్యాన్ని పెంచుకోవడానికి న్యాయ వేదికను ఉపయోగించుకుంటున్నారు" అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యానించారు. ఒక పార్టీ అభ్యర్థన మేరకు మొత్తం రాష్ట్రానికి విస్తృత ఉత్తర్వులను ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర స్థాయి వివాదం కావడం వల్ల పాట్నా హైకోర్టును ఆశ్రయించాలని ప్రశాంత్ కిశోర్ కు సూచించారు.

గత ఏడాది 243 స్థానాల బీహార్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 202 స్థానాలు గెలిచి అధికారం చేపట్టింది. ఇండియా కూటమి 35 సీట్లు సాధించింది. జన సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, దాని అభ్యర్థులందరూ డిపాజిట్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ.. ప్రశాంత్ కిశోర్ మాత్రం పోటీ చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+