అంబులెన్స్ ఉన్నా..వెళ్లే దారి లేక: ప్రసవం కోసం అయిదు కిలోమీటర్లు మంచంపై గర్భిణీ!
భువనేశ్వర్: ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఎదుర్కొంటున్న అత్యంత దైన్య స్థితికి అద్దం పట్టే ఉదంతం ఇది. అంబులెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అది వెళ్లే దారి లేదు. వాహన రాకపోకలకు అనువుగా లేని కారణంగా.. ఏజెన్సీలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఓ గర్భిణీని మంచంపై సుమారు అయిదు కిలోమీటర్ల దూరం పాటు మోసుకుంటూ వెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. రోడ్డు సౌకర్యం ఉన్న చోట నిలిచివున్న అంబులెన్స్ ను చేరుకోవడానికి వారు ఆ గర్భిణీని అయిదు కిలోమీటర్ల దూరం వరకు మోసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె పడ్డ పురిటి నొప్పులు వర్ణనాతీతం. ఈ ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ గర్భిణీ పేరు హర్సోమణి బిషోయ్. కోరాపుట్ జిల్లాలోని దశ్మంత్ పూర్ బ్లాక్ పరిధిలో మారుమూల గ్రామం కలియంబోలో తన భర్త ఉమాకాంత బిషోయ్ తో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు ఆరంభం అయ్యాయి. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. కలియంబో వరకూ వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదు. కాలి నడక మార్గం కూడా అంతంత మాత్రమే. పైగా కోరాపుట్ జిల్లాలో విస్తారంగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ఉన్న మట్టి రోడ్డు కాస్త బురదమయమైంది. ఫలితంగా- కలియంబో గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న డుంబగూడ వరకు వచ్చిన అంబులెన్స్ అక్కడే ఆగిపోయింది.

దీనితో ఉమాకాంత్, ఇతర కుటుంబ సభ్యులు ఆ గర్భిణీని మంచంపై కూర్చోబెట్టుకుని మోసుకుంటూ డుంబగూడ వరకు వెళ్లారు. అక్కడి నుంచి ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు వెలుగులోకి వచ్చిన వెంటనే కోరాపుట్ జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని జిల్లా వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు సౌకర్యాన్ని కల్పించడానికి గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రోడ్డు వేయడానికి అనువైన పరిస్థితులు ఉంటే.. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications