Wife: భర్త మీద పగ, పిల్లలు, అత్తను కట్టేసి గర్బవతి భార్య మీద రేప్, వాడి కులం ఏందిరా, నా మాటకే !
భోపాల్/మధ్యప్రదేశ్/ చెన్నై: కూలి పనులు చేస్తున్న వ్యక్తి అతని తల్లితో పాటు భార్య, పిల్లలను పోషిస్తూ జీవిస్తున్నాడు. భార్య ప్రస్తుతం గర్బవతి. కరోనా వైరస్ కారణంగా అతను ఇంటికే పరిమితం అయ్యాడు. జ్వరంగా ఉండటంతో ఆ వ్యక్తి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓ పెద్దింటి భూస్వామి తన పొలంలో చెట్లు నరికివేయాలని ఆ కూలికి చెప్పాడు. తనకు జ్వరంగా ఉందని, ఇప్పుడు వీలుకాదని, వచ్చే వారం చూద్దామని ఆ కూలీ చెప్పాడు. ఎంత పొగరురా నీకు అంటూ ఆ భూస్వామి రెచ్చిపోయాడు. కూలీ భార్య, పిల్లలు, అతని తల్లిని కిడ్నాప్ చేసి పొలం దగ్గర ఉన్న ఇంటిలో నిర్బంధించారు. పిల్లలను, అత్తను కట్టేసి వాళ్ల కళ్ల ముందే కూలీ భార్యను ఆత్యాచారం చేసి నాలుగు రోజులు లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. వాడి కులం ఏందిరా, నా మాటకే ఎదురు చెబుతాడా అంటూ భూస్వామి రెచ్చిపోయాడు. కూలీ దళితుడు కావడం వలనే అతని భార్య గర్బవతి అని కూడా చూడకుండా అత్యాచారం చెయ్యడం దూమరం రేపింది. ఓ జర్నలిస్టు జోక్యం చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తల్లి, భార్య, పిల్లలు
మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో రంజిత్, కరిష్మా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది). రంజిత్, కరిష్మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కరిష్మా గర్బవతి. రంజిత్ కూలీ పని చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలు అతని తల్లిని పోషిస్తున్నాడు. ఉన్నకాడికి రంజిత్ అతని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగానే ఉంటున్నాడు.

కరోనా వైరస్ దెబ్బ
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో కొన్ని రోజుల నుంచి పనికి వెళ్లకుండా రంజిత్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇదే సమయంలో రంజిత్ కు జ్వరం వచ్చిందని తెలిసింది. గ్రామంలో భూస్వాములు చెప్పిన పనిని రంజిత్ చేస్తున్నాడు. ఓ భూస్వామి అతని పొలంలో ఉన్న చెట్లు నరికి వేయాలని రంజిత్ కు చెప్పాడు.

దళితుడికి ఇంత గర్వమా ?
తనకు జ్వరంగా ఉందని, ఇప్పుడు పని చెయ్యలేనని, వచ్చే వారం మీ పొలంలోని చెట్లు కత్తిరిస్తానని రంజిత్ ఆ భూస్వామికి చెప్పాడని తెలిసింది. దళితుడు అయిన రంజిత్ తనకు ఎదురు చెబుతున్నాడని, చెప్పిన పని చెయ్యలేదని ఆ భూస్వామి రంజిత్ మీద రగిలిపోయాడని తెలిసింది. రంజిత్ కు ఎలాగైన బుద్ది చెప్పాలని ఆ భూస్వామి డిసైడ్ అయ్యాడు.

అమ్మ, భార్య, పిల్లలను కట్టేసి గర్బవతి మీద రేప్ ?
రంజిత్ భార్య కరిష్మాను, ఆమె పిల్లలు, రంజిత్ తల్లిని ఆ భూస్వామి కిడ్నాప్ చేసి పొలం సమీపంలోని ఇంటిలో నిర్బంధించాడని తెలిసింది. నాలుగు రోజుల పాటు అందరిని ఆ భూస్వామి, అతని అనుచరులు నరకం చూపించారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో రంజిత్ పిల్లలు, ఆమె తల్లిని కట్టేసిన భూస్వామి కరిష్మా మీద అత్యాచారం చేసి నాలుగు రోజుల పాటు వాళ్లకు నరకం చూపించాడని ఆరోపణలు ఉన్నాయి.

కేసు మార్చేసిన పోలీసులు ?
రంజిత్ భార్య, పిల్లలను కిడ్నాప్ చేసి రూమ్ లో నిర్బంధించారని స్థానిక జర్నిలిస్టుకు సమాచారం అందింది. ఆ జర్నలిస్టు పోలీసులను వెంట పెట్టుకుని వెళ్లి వారిని విడిపించారు. అయితే పోలీసులు మాత్రం దళిత మహిళ మీద అత్యాచారం జరిగిందని కేసు నమోదు చెయ్యకుండా ఆమె కుటుంబ సభ్యులను నిర్బంధించారని, చిత్రహింసలు పెట్టారని కేసు నమోదు చేశారని వెలుగు చూసింది.

సాక్షాలు లేవంటున్న పోలీసులు ?
గర్బవతి అయిన బాధితురాలిని శారీరకంగా హింసించారని, కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ తాము కేసులు నమోదు చేశామని, ఇదే కేసులో భూస్వామి అనుచరులు ఇద్దరిని అరెస్టు చేశామని, భూస్వామి తప్పించుకున్నాడని ఛతుర్పూర్ జిల్లా ఎస్పీ సచిన్ శర్మా స్థానిక మీడియాకు చెప్పారు. దళిత మహిళ తన మీద అత్యాచారం జరిగిందని చెప్పలేదని, అలా చెబితే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తామని జిల్లా ఎస్పీ సచిన్ శర్మా అన్నారని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురిచింది. గర్బవతి అయిన దళిత మహిళ మీద అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసినా ఆ సెక్షన్ కింద కేసు నమోదు చెయ్యకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications