హిమాచల్‌ప్రదేశ్: బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ ధుమాల్
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ధుమాల్ పేరును ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రకటించారు.
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ధుమాల్ పేరును ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రకటించారు.
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అయిన వీరభద్రసింగ్తో ఈయన తలపడనున్నారు. 12వ హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ధుమాల్ పనిచేశారు. మార్చి 1998 నుంచి మార్చి 2003 వరకు, 2008 జనవరి 1 నుంచి 2012, డిసెంబర్ 25 వరకు ఆయన రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.

1982లో భారతీయ జనతా యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా ధుమాల్ పనిచేశారు. 1984లో హమీర్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన ఎంపికయ్యారు. అప్పటికే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఓపినియన్ పోల్స్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం నెలకొల్పుతుందని చెప్పడం గమనార్హం.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications