ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాష్ట్రపతి కీలక నిర్ణయం..! కొత్త విద్యామంత్రిగా..!
నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ తర్వాత ఢిల్లీలో చెలరేగిన నిరసనలు కాస్తా దేశవ్యాప్తంగా విస్తరించడంతో ఇక చేసేది లేక ఇవాళ విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా సమర్పించారు. విద్యార్ధుల ఆందోళనల్లో జాతి వ్యతిరేక శక్తులు దూరే ప్రమాదం ఉందనే కారణంతో నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు సుదీర్ఘ లేఖ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయన రాజీనామాను ఆమోదించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి (President) ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) కొద్దిసేపటి క్రితం ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించాల్సిందిగా ప్రధాని మోడీ నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు రాష్ట్రపతి ముర్ము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర మంత్రి మండలిలో ఖాళీ ఏర్పడినట్లు నోటిఫై చేస్తారు. అనంతరం కొత్త మంత్రిని తీసుకునే అవకాశం ప్రధానికి ఉంటుంది.

మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఖాళీ అయిన విద్యాశాఖ మంత్రి పదవిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పాటు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రి మండలిని ప్రక్షాళన చేయాలని భావించిన ప్రధాని మోడీ చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఆయన చూస్తున్న విద్యాశాఖను ప్రధాని మోడీ మరో మంత్రి ప్రహ్లాద్ జోషీకి అప్పగించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కేంద్ర కేబినెట్ ప్రక్షాళన చేపట్టే అవకాశం ఉంది. అందుకో కొత్త మంత్రి ఎంపిక ఉంటుంది.












Click it and Unblock the Notifications