ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక, ఆ 30 నిమిషాల్లో సీన్ ఛేంజ్ - తప్పని పరిస్థితుల్లో..!!
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. విద్యార్దులు అనుకున్నది సాధించారు. సీజేపీ.. విద్యార్దులు తమ సత్తా నిరూపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన డిమాండ్లకు ఓకే చెప్పిన కేంద్రం.. చివరకు ఈ డిమాండ్ కు అంగీకరించక తప్పలేదు. ఈ రాజీనామా నిర్ణయాని కి ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విద్యార్ధుల ఉద్యమం.. పెరుగుతున్న మద్దతు తో కేంద్రం వెనుకడుగు తప్పదని డిసైడ్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో కీలక అంశాలను వెల్లడించారు.
నిరసనలతో హోరెత్తిన ఢిల్లీ.. ఇప్పుడు విద్యార్ధుల సంబరాలతో నిండిపోయింది. నీట్ పరీక్షా పేపర్ల లీక్.. తదనంతర పరిణామాలతో విద్యార్దులు రోడ్డెక్కారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం తొలి నుంచి డిమాండ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా ఢిల్లీ కేంద్రంగా పెద్ద సంఖ్యలో విద్యార్ధులు నిరసనలో పాల్గొన్నారు. ఛలో పార్లమెంట్ ఉద్రిక్తంగా మారింది. ప్రధాని మోదీ స్వయంగా విద్యార్ధులకు హామీ ఇచ్చారు. పరీక్షా పత్రాల లీక్ చేస్తే కఠిన చర్చలు తప్పవని చొత్త చట్టం తీసుకొచ్చారు. విద్యార్ధుల భవిష్యత్ తమకు ముఖ్యమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ తరువాత ఎన్టీఏలో ప్రక్షాళన చేసారు. కొత్త పరీక్షా విధానం ప్రకటించారు. కాక్రోచ్ పార్టీ ప్రతినిధుల తో చర్చలు చేసారు. అందులో వారి డిమాండ్లకు అంగీకరించారు. అయినా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే నిరసన ఆగుతుందని సీజేపీ తేల్చి చెప్పింది.

కాగా, ఈ మధ్యాహ్నం మరో విడత సీజేపీతో చర్చలు జరగాల్సి ఉంది. దీంతో.. ఈ ఉదయం నుంచి కేంద్రంలోని ముఖ్యులు ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు చేయటం ద్వారా విద్యార్దులను శాంతింప చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ సమయంలోనే రాహుల్ గాంధీ.. విద్యార్ది సంఘ నేతలు స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రిగా తొలిగించటం మినహా మరో ఆలోచనకు అంగీకారం ఉండదని తేల్చి చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే ప్రధాని రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేసారు. దీంతో..పాటుగా ఇతర రాష్ట్రాల్లో విద్యార్ధుల నిరసనల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల పైన కేంద్రం సమీక్ష చేసింది. సమస్య మరింత జటిలం కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాలని డిసైడ్ అయింది. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను ప్రధానికి పంపారు.
ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో దేశ యువత భవిష్యత్తు, దేశ ఐక్యతను దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రివర్గ సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశసేవకు ఎప్పటికీ అంకితభావంతో కొనసాగుతానని లేఖలో స్పష్టం చేసారు. 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేసారు. తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని స్పష్టం చేసారు. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తిగా ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. యువత చదువు కోసమే సమయం కేటాయించాలని సూచించారు.












Click it and Unblock the Notifications