మోడీ ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత..! రాహుల్, అఖిలేష్ అరెస్ట్..!

కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న విద్యార్దులపై పోలీసుల లాఠీచార్జ్, భాష్పవాయువు ప్రయోగాలకు నిరసనగా ఇవాళ విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సహా పలు విపక్ష పార్టీల నాయకులు ప్రధాని మోడీ నివాసం ముందు ధర్నాకు దిగారు. జంతర్ మంతర్ వద్దకు వెళ్లి కాక్రోచ్ పార్టీ నేతలు, విద్యార్ధులకు సంఘీభావం తెలిపి, అనంతరం ప్రధాని మోడీ ఇంటివద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

ఇవాళ ఉదయం పార్లమెంట్ కు వెళ్లి నిన్న విద్యార్దులపై జరిగిన దాడులపై చర్చించాలని, హోంమంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టిన విపక్షాలు.. ప్రభుత్వం స్పందించకపోయేసరికి నిరసనలకు దిగాయి. దీంతో పార్లమెంట్ ఉభయసభలూ పలుమార్లు వాయిదా పడ్డాయి. అనంతరం జంతర్ మంతర్ కు చేరుకున్న విపక్ష నేతలు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రివాల్, మమతా బెనర్జీ కాక్రోచ్ పార్టీ నాయకుల్ని, విద్యార్దుల్ని పరామర్శించారు. అనంతరం వీరిలో రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీ నివాసానికి బయలుదేరారు.

Rahul Gandhi Akhilesh Yadav Detained as Delhi Police Clear Protest Site Outside PM s Residence

ప్రధాని మోడీ నివాసం వద్దకు చేరుకుని కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ దూతగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ను రాహుల్ గాంధీ వద్దకు పంపింది. అయితే రాహుల్ గాంధీ ఐదు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. వీటిపై అమిత్ షాతో మాట్లాడి చెప్తానని వెళ్లిన జితేంద్ర సింగ్.. అనంతరం వచ్చినా ఎలాంటి కీలక హామీలు ఇవ్వలేదు. దీంతో ఇవాళ రాత్రి మోడీ నివాసం ముందు ధర్నా కొనసాగిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో పోలీసులు వరుసగా విపక్ష నాయకుల్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వ్యాన్ లో తరలించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్దితులు చోటు చేసుకున్నాయి. రాహుల్ గాంధీ నేలపై పడుకుని పోలీసులు తనను తీసుకెళ్లకుండా కాసేపు అడ్డుకున్నారు. అనంతరం రాహుల్ ను, అఖిలేష్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ నేతల్ని పోలీసులు బలవతంగా వ్యాన్ ఎక్కించి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+