సువ్రా అంత్యక్రియలు పూర్తి: హాజరైన బంగ్లా ప్రధాని
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ (74) అంత్యక్రియలను బుధవారం లోడీ రోడ్డు శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఆమె భౌతిక కాయానికి విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతక ముందు ప్రధాని నరేంద్రమోడీ సువ్రా భౌతిక కాయానికి నివాళుర్పించారు.
The Prime Minister, Shri @narendramodi at the last rites of Smt. Suvra Mukherjee, First Lady, in New Delhi. pic.twitter.com/PhNUigOmk0
— MIB India (@MIB_India) August 19, 2015 రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కుమార్తె షర్మీస్తా, కుమారులు అభిజిత్, ఇంద్రజిత్‌లతో పాటూ ప్రధాని నరేంద్రమోడీ, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, పశ్చిమ్‌బంగ సీఎం మమతా బెనర్జీలతో పాటు పలువురు అంత్యక్రియలకు హాజరయ్యారు.
సువ్రా ముఖర్జీ గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం 10.51 నిమిషాలకు మృతి చెందిన విషయం తెలిసిందే. సువ్రా ముఖర్జీ గత కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధికి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10.51 నిమిషాలకు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
సువ్రా ముఖర్జీ అంత్యక్రియలకు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా హాజరయ్యారు. బుధవారం ఉదయం సువ్రా ముఖర్జీకి ఆమె నివాళులర్పించారు. సువ్రా ముఖర్జీ మృతి సందర్భంగా షేక్ హసీనా మంగళవారం ప్రణబ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. సువ్రా అంత్యక్రియలకు షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా హాజరయ్యారు.

సువ్రా ముఖర్జీ అంత్యక్రియలు పూర్తి
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ (74) అంత్యక్రియలను బుధవారం లోడీ రోడ్డు శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఆమె భౌతిక కాయానికి విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతక ముందు ప్రధాని నరేంద్రమోడీ సువ్రా భౌతిక కాయానికి నివాళుర్పించారు.

సువ్రా ముఖర్జీ అంత్యక్రియలు పూర్తి
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ (74) అంత్యక్రియలను బుధవారం లోడీ రోడ్డు శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఆమె భౌతిక కాయానికి విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
సువ్రా భౌతిక కాయానికి నివాళుర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ

సువ్రా ముఖర్జీ అంత్యక్రియలు పూర్తి
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ (74) అంత్యక్రియలను బుధవారం లోడీ రోడ్డు శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఆమె భౌతిక కాయానికి విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సువ్రా భౌతిక కాయానికి నివాళుర్పిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

సువ్రా ముఖర్జీ అంత్యక్రియలు పూర్తి
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ (74) అంత్యక్రియలను బుధవారం లోడీ రోడ్డు శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఆమె భౌతిక కాయానికి విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సువ్రా భౌతిక కాయానికి నివాళుర్పిస్తున్న ఢిల్లీ లెప్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.












Click it and Unblock the Notifications