వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏని అమలుచేయకపోతే... రాష్ట్రపతి పాలన తప్పదు : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను అమలుచేసే విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉంది. విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చినా సరే సీఏఏ అమలుపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం స్పష్టం చేశారు. అయినా సరే విపక్షాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ఉదయ్ ప్రతాప్ సింగ్ సీఏఏపై కీలక వ్యాఖ్యలు చేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన: సైకిలెక్కిన మాజీ ముఖ్యమంత్రి..!పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన: సైకిలెక్కిన మాజీ ముఖ్యమంత్రి..!

 సీఏఏని అమలుచేయకపోతే రాష్ట్రపతి పాలనే :

సీఏఏని అమలుచేయకపోతే రాష్ట్రపతి పాలనే :

పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను అమలుచేయమని ఏ రాష్ట్రాలైతే మొండికేస్తాయో.. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన తప్పదన్నారు ఎంపీ ఉదయ్ ప్రతాప్ సింగ్. రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్ చేసిన చట్టాన్ని రాష్ట్రాలు అమలుచేయాల్సిందేనన్నారు. కాదు,కూడదు అంటే.. అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని,అప్పుడు రాష్ట్రపతి తన విచక్షణా అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ఆస్కారం ఉందని అన్నారు.

ఆర్టికల్ 356 ప్రకారం.. :

ఆర్టికల్ 356 ప్రకారం.. :

పార్లమెంట్ ఆమోదించిన సీఏఏని రాష్ట్రాలు అమలుచేయకపోతే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి ఆయా ప్రభుత్వాలను రద్దు చేస్తారని ఎంపీ అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే అధికారం ఆర్టికల్ 356 రాష్ట్రపతికి కల్పించిందన్నారు.

వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు.. :

వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు.. :

సీఏఏ చట్టంపై తొలి నుంచి బలమైన ధిక్కార స్వరం వినిపిస్తున్న వ్యక్తి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్,పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్,ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాగెల్,ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా తమ రాష్ట్రాల్లో సీఏఏని అమలుచేయమని ప్రకటించారు.

 బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు :

బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు :

సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై బీజేపీ నేతలు స్పందిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. తాజాగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి సీఏఏపై వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. సీఏఏని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నవారు.. దేశంలో మెజారిటీ జనాభా 80శాతం,మీ జనాభా 15శాతం అన్న సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. దేశంలోని 80శాతం జనాభా వీధుల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. గతంలో కర్ణాటక మంత్రి సీటీ రవి కూడా సీఏఏపై వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. సీఏఏని అడ్డుకోవాలని చూస్తే.. మెజారిటీ ప్రజలు సహనం కోల్పోతారని,అదే జరిగితే దేశంలో మరో గోద్రా ఘటన పునరావృతమవుతుందని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఎన్ని నిరసనలు చేసినా.. సీఏఏ చట్టాన్ని అమలుచేసే విషయంలో
బీజేపీ వెనుకగడుగు వేసే ప్రసక్తే లేదన్నది ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

English summary
Bharatiya Janata Party MP Uday Pratap Singh on Saturday said that President's rule can be imposed in states who are opposing the Citizenship Amendment Act (CAA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X