ఫలితాలపై ప్రధాని మోదీ రియాక్షన్.. 27 సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఇదే..
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి 48 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. దీంతో దాదాపు 27 సంవత్సరాల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. తాజాగా దిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇది ప్రజల విజయమని,అభివృద్ధి గెలిచిందని, ప్రజా పాలన రాబోతోందని ట్వీట్ చేశారు.
" దిల్లీ ప్రజలకు, అన్నదమ్ములు, అక్కాచెళ్లెల్లకు నా సాల్యూట్. ఈ విజయాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు. నా మనసులోనుంచి మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరు బీజేపీను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీకు అన్ని విధాలుగా దిల్లీను అభివృద్ధి చేస్తామని గ్యారంటీ ఇస్తున్నా. ప్రజలు సౌకర్యవంతంగా జీవించేలా కృషిచేస్తాం. దేశాభివృద్ధిలో దిల్లీని భాగం చేస్తాం. బీజేపీ కార్యకర్తలను చూస్తుంటే గర్వంగా ఉంది. రాత్రింబవళ్లు వాళ్లు విజయం కోసం కృషి చేశారు. ఈ విజయంతో దిల్లీలో మరింత అభివృద్ధి చేస్తాం" అని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా స్పందించారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 7 గంటలకు బీజేపీ సెంట్రల్ ఆఫీస్‌కు పీఎం నరేంద్రమోదీ చేరుకోనున్నారు. దిల్లీ ఫలితాలు, ముఖ్యమంత్రి ఎంపికపై సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దిల్లీ ఎన్నికల్లో ఆప్ మాజీ సీఎం కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ అగ్రనేతలు ఓటమిని చవిచూశారు. న్యూదిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్.. కేజ్రీవాల్ ను ఓడించారు.












Click it and Unblock the Notifications