షాకింగ్ వీడియోతో దేశంలో డిజిటల్ అరెస్ట్ లపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన సైబర్ నేరాల పైన, డిజిటల్ అరెస్ట్ పైన మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్ మోసం కింద సైబర్ నేరగాళ్లు తమని తాము పోలీసులుగా, సిబిఐ అధికారులుగా, ఆర్బిఐ అధికారులుగా, నార్కోటిక్స్ అధికారులుగా చిత్రీకరిస్తూ ప్రజలను నమ్మించేలా మాట్లాడుతూ దోపిడీకి పాల్పడుతున్నారని ప్రధాన నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

డిజిటల్ అరెస్ట్.. సైబర్ మోసాలపై మోదీ ఏమన్నారంటే
దీనికి సంబంధించిన వీడియోను కూడా చూపిస్తూ సైబర్ నేరాల పైన మాట్లాడిన ప్రధాని మోదీ ఏ ప్రభుత్వ సంస్థలు ప్రజలను ఫోన్లో బెదిరించడం మరియు డబ్బు డిమాండ్ చేయడం జరగవని తెలిపారు. ఇక అటువంటి ప్రయత్నాలను రికార్డ్ చేయాలని కూడా ప్రజలకు సూచించారు .

Prime Minister Modi sensational comments on digital arrests in the country with a shocking video

నకిలీ పోలీస్ స్టేషన్లు, నకిలీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలతో మోసం
సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక వీడియోను చూపించి ఆ వీడియోలో వ్యక్తులను మోసం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో తెలిపారు. సైబర్ నేరగాళ్లు నకిలీ పోలీస్ స్టేషన్లను, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కార్యాలయాలను కూడా సెటప్ చేసి కాల్ చేస్తారని, సమయం లేదని చెబుతూనే బాధితుల పైన ఒత్తిడి తెస్తారని ఆ సమయంలో బాధితులకు ఆలోచించే అవకాశం కూడా ఉండదని తెలిపారు.

సైబర్ నేరాల నియంత్రణకు మోదీ మూడు మార్గాలు
ఈ క్రమంలోనే దేశంలో చాలామంది లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్ల వల్ల పోగొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరాలను నియంత్రించడానికి ఆపండి.. ఆలోచించండి.. చర్య తీసుకోండి అంటూ మూడు మార్గాలను తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని, వ్యక్తిగత సమాచారం ఇవ్వటం ఆపాలన్నారు.

ఈ పని చెయ్యాలని దేశ ప్రజలకు మోదీ సూచన
ఏ ప్రభుత్వం ఏజెన్సీ మీకు వీడియో కాల్స్ చేయదని అలాంటి కాల్స్ ఏవైనా వస్తే ఒక్క క్షణం ఆలోచించాలన్నారు. ఆపై చర్యలో భాగంగా తక్షణం రికార్డు చేయమని తెలిపారు. వెంటనే సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని, ప్రభుత్వ ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. చట్టంలో డిజిటల్ అరెస్టు లాంటి వ్యవస్థ లేదని డిజిటల్ అరెస్టు విషయంలో జరుగుతున్న మోసానికి వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థలు పని చేస్తున్నాయని మోడీ తెలిపారు.

అవగాహనతో అడుగు వెయ్యండి
డిజిటల్ నేరగాళ్లు, సైబర్ నేరాలపై పోరాటంలో యువతతో పాటు విద్యార్థులు ముందుకు రావాలని ఇతరులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఫైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+