ముంబై వీధుల్లో బ్రిటన్ యువరాజు దంపతులు- సచిన్ తో గల్లీ క్రికెట్, స్ట్రీట్ ఫుడ్...!

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం (Prince William) , ప్రిన్సెస్ కేట్ (Princess Kate) దంపతులు ఇవాళ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో కలిసి వారు ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. బిజీగా ఉండే ముంబై రోడ్లను వీరి కోసం ఖాళీ చేయించారు. దీంతో యువరాజు-యువరాణి సచిన్ తో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. వీరిని చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు కూడా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.

దేశవ్యాప్తంగా ఉద్యోగ గ్యారెంటీ!నిరుద్యోగానికి చెక్ పెట్టేలా బ్రిటన్ సంచలన నిర్ణయం..
దేశవ్యాప్తంగా ఉద్యోగ గ్యారెంటీ!నిరుద్యోగానికి చెక్ పెట్టేలా బ్రిటన్ సంచలన నిర్ణయం..

మూడు రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చిన విలియం-కేట్ దంపతులు ఇవాళ భారత్ లోని పురాతన ఫొటోగ్రఫీ స్టూడియోల్లో ఒకటైన ముంబై హామిల్టన్ స్టూడియోస్ కు వచ్చారు. సచిన్ తో కలిసి అక్కడికి వచ్చిన వారు.. ఆ తర్వాత ముంబై వీధుల్లో ఆహారపు రుచుల్ని ఆస్వాదించారు. బ్రిటన్ కు కాబోయే రాజు, రాణి అయిన విలియం-కేట్ ఉదయం ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ వీధుల్లో సాధారణ పౌరుల్లా నడుస్తూ దర్శనమిచ్చారు. అనంతరం వీరంతా స్ధానిక పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. సచిన్ యువరాజు-యువరాణికి బౌలింగ్ వేశారు. అనంతరం ప్రిన్స్ విలియం బౌలింగ్ లో సచిన్ బ్యాటింగ్ చేశారు. గతంలో 2016లో భారత్ కు వచ్చినప్పుడు కూడా వీరు ఇలాగే పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడారు.

Prince William and Princess Kate Explore Mumbai s Street Food Scene Alongside Sachin Tendulkar
మోడీ ఇంట్లో క్రికెటర్ సూర్య కుమార్ ధంతెరాస్- కూతురు పాటకు ప్రధాని చప్పట్లు..!
మోడీ ఇంట్లో క్రికెటర్ సూర్య కుమార్ ధంతెరాస్- కూతురు పాటకు ప్రధాని చప్పట్లు..!

అనంతరం విలియం-కేట్ దంపతులు ముంబై మెట్రో రైలులో ప్రయాణించబోతున్నారు. అలాగే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతోనూ సమావేశం కానున్నారు. రేపు ఎర్త్‌షాట్ ప్రైజ్ వేడుకకు హాజరై, ఆ తర్వాత న్యూఢిల్లీకి వెళ్తారు. అక్కడ ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వీరు భేటీ కానున్నారు. దీంతో భారత్ లో వారి మూడు రోజుల పర్యటన ముగియనుంది. భూమి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లకు వినూత్న పరిష్కారాలను గుర్తించి, వాటికి మద్దతు ఇచ్చేందుకు 2020లో విలియం స్థాపించిన పర్యావరణ కార్యక్రమం ఎర్త్‌షాట్ ప్రైజ్ ఆరో ఎడిషన్ కోసం వీరు ముంబైకి వచ్చారు. తమ ప్రాజెక్టులను విస్తరించుకోవడానికి ఐదుగురు విజేతలు ఒక్కొక్కరికి మిలియన్ యూరోల చొప్పున అందించనున్నారు. ఇప్పటివరకు జరిగిన అవార్డుల వేడుకలలో ఇదే అతిపెద్దది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+