Maharashtra: దారుణం.. ఆరో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్, టీచర్ అత్యాచారం
Maharashtra: విద్యాబుద్ధులు నేర్పించి చక్కదిద్దాల్సిన గురువులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చదువుతున్న పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్ ఈ దారుణానికి ఒడిగట్టారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులిద్దరిపైనా ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ ఘటన నాసిక్ జిల్లాలోని ఇగత్ పురి తాలూకాలో శుక్రవారం జరిగిందని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ఆరో తరగతి విద్యార్థిని క్లాస్ టీచర్ గోరఖ్ నాథ్ మారుతి జోషి.. ఆ బాలికను ప్రధానోపాధ్యాయుడు తుకారాం గోవింద్ సాబుల్(53) ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరూ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితుడు ఆమెను ఇంటికి తీసుకువచ్చి వదిలేశాడు. బాధిత బాలిక ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు అనుమానం రావడంతో ఆరా తీశారు. ఈ క్రమంలో బాధిత బాలిక అసలు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించిందియ నిందితులిద్దరిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆగ్రహించిన గ్రామస్థులు.. బాధితురాలికి న్యాయం చేయాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గతేడాది అక్టోబర్ లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై టీచర్ అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యూషన్ క్లాస్ సాకుతో నిందితుడు బాలికను పాఠశాలకు పిలిచి తన కామానికి బాధితురాలిగా చేశాడు. అనంతరం పేరెంట్స్ కు చెబితే చంపేస్తానని బెదిరించాడు. అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. పేరెంట్స్ కు అనుమానం వచ్చి గట్టిగా అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications