విద్యార్థినిని గర్భవతినిచేసిన టీచర్, రూ.50 లక్షలిచ్చి దాచాలనుకొన్నారు

ముంబై: భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు అనైతికానికి పాల్పడుతున్నారు. కన్నబిడ్డలుగా చూడాల్సిన విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.. ముంబైలోని ఓ పాఠశాలలో విద్యార్తిని గర్భవతిని చేసి, విషయం బయటకు రాకుండా రూ.50 లక్షలను ఇవ్వజూపిన ఘటన వెలుగుచూసింది.

ఐదు మాసాల క్రితం వివాదంలో నిలిచిన నీరుల్ ఎంజీఎం స్కూల్ మరోసారి వివాదానికి కారణమైంది. ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు ఓ 15 ఏళ్ళ విద్యార్థినిని గర్భవతిని చేశాడు. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకుగాను రూ.15 లక్షలను లంచం ఇచ్చేందుకు పాఠశాల స్కూల్ ప్రిన్సిఫాల్ ప్రయత్నించిన ఘటన వెలుగుచూసింది.

Prinicipal offered Rs.50 lakh to mother of raped student

ఈ పాఠశాలలోని హరిశంకర్ శుక్లా అనే ఉపాధ్యాయుడు 13 ఏళ్ళ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో ఈ విషయాన్ని బయటకు రాకుండా చేయాలని భావించారు. పాఠశాలకు చెందిన ప్రిన్సిఫాల్ సవితా గులాటీ బాధితురాలి తల్లికి రూ.50 లక్షలను లంచం ఇవ్వజూపారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ డబ్బులు తీసుకొని నోరుమూసుకొని ఉండాలని స్కూల్ ప్రిన్సిఫాల్ బాధితురాలిని బెదిరించారని బాదితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు.అంతేకాదు జరగబోయే పరిణామాలను తీవ్ర బాద్యత వహించాల్సి వస్తోందని హెచ్చరించారని సమాచారం.ఈ విషయమై సిబిఎస్ఈ ఈ ఘటనపై పాఠశాలకు షోకాజ్ నోటీసు పంపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+