మహారాష్ట్రలో ప్రమాదానికి గురయిన ప్రైవేట్ హెలికాప్టర్..
మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. పుణే జిల్లా పౌద్ ప్రాంతంలో శనివారం (ఆగస్టు 24) ముంబయి నుంచి హైదారబాద్ కు వస్తున్న ఓ ప్రయివేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ముంబయి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి ప్రతికూల వాతావరణం, సాంకేతిక లోపమే కారణమని సమాచారం. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ హెలికాఫ్టర్ ఘటనల పైలట్ సహా నలుగురు వ్యక్తులు ఉన్నట్లు, పోలీసులు అధికారులు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు వారంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. గాయాలతో బాధపడుతున్నవారిని అధికారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

పైలట్‌కు తీవ్ర గాయాలు..
ఈ ప్రమాద సంఘటనలో పైలట్ తీవ్రంగా గాయాలపాలయ్యినట్లు, ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా.. మిగిలిన ముగ్గురూ సురక్షితంగా ఉన్నట్లు ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు. పుణే జిల్లా పౌద్ సమీపంలో కుప్పకూలిన ఆ హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినదిగా అధికారులు గుర్తించారు. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కెప్టెన్ ఆనంద్ తీవ్ర గాయలపాలయ్యారు. ఆయనను అధికారులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో భాటియా, అమర్‌దీప్ సింగ్, ఎస్పీ రామ్‌ల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
A helicopter has crashed in the India's Pune district following severe turbulence caused by bad weather. 4 person onboard are injured including two pilots.#helicoptercrash #India #Pune pic.twitter.com/ZoJJreOwVp
— Moazzam Ali Siddiqui (@MoazzamTweet) August 24, 2024












Click it and Unblock the Notifications