వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంకకు పగ్గాలు అప్పగించాలి.. చింతన్ శివర్ సదస్సులో ఆచార్య ప్రమోద్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే పగ్గాలు మారాల్సిందే. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినా ఫలితం రాలే. మరీ పార్టీకి ప్రభ పెరగాలంటే ఏం చేయాలి..? ఎవరికీ నాయకత్వం అప్పగించాలనే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో గల చింతన్ శివర్‌లో సదస్సు నిర్వహిస్తోంది. ఇక్కడ పార్టీ కొత్త అధ్యక్ష పదవీపై చర్చ జరిగింది. నేతలు ప్రియాంక వైపు మొగ్గు చూపుతున్నారు. రాహుల్ వద్దంటే ప్రత్యామ్నాయం ప్రియాంకే అని అంటున్నారు.

సోనియా.. రాహుల్..

సోనియా.. రాహుల్..


ఇప్పటికే సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అంతకుముందు అధ్యక్ష పదవీ చేపట్టారు. గత ఎన్నికలకు బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఆశాకిరణం ప్రియాకం గాంధీ.. అయితే ఆమె యూపీ ఎన్నికలను భుజాన వేసుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే బీజేపీ విజయం సాధించింది.

 ప్రియాంక జోష్

ప్రియాంక జోష్


కానీ ప్రియాంక గాంధీ అంటే.. శ్రేణుల్లో ఉత్సాహాం నెలకొంది. ఆమె నానమ్మ ఇందిరాగాంధీని పోలి ఉండటమే కారణం. ఈ క్రమంలో సీనియర్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణన్ తమ పార్టీ అధ్యక్ష పదవీ ప్రియాంక గాంధీ చేపట్టాలని అన్నారు. పార్టీలో ఆమె పాపులర్ అని పేర్కొన్నారు. రెండేళ్లుగా రాహుల్ గాంధీని అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కోరుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆయన మాత్రం నో అంటున్నారు. ఆయన అప్పటికీ ఒప్పుకోకుంటే ప్రత్యామ్నాయం ప్రియాకం గాంధీయేనని అంటున్నారు.

నో రెస్పాన్స్

నో రెస్పాన్స్


ఆచార్య ప్రమోద్ ఈ వ్యాఖ్యలు.. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ముందు చేశారు. కానీ వారు దీనిపై స్పందించలేదు. చూడాలీ మరీ.. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో.. రాహుల్ వస్తారా.. లేదంటే ప్రియాంకకు పగ్గాలు అప్పగిస్తారో చూడాలీ. ఒకవేళ ప్రియాంకకు పగ్గాలు ఇస్తే.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా డామినేషన్ ఉంటుంది. సో అంత ఈజీగా పగ్గాలు అప్పగించే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏదయినా సాధ్యమే.. ఏం జరుగుతుందో తెలియాలంటే మరి కొద్దీరోజులు ఆగాల్సిందే.

English summary
Congress is holding a three-day brainstorming session, 'Chintan Shivir', in Udaipur in Rajasthan this week with strengthening the party as the main focus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X