Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకయ్యా.. సిగ్గుపడుతున్నా.. ఐరాసలో భారత్ తీరుపై ప్రియాంక గాంధీ..

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొన్నిరోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఇందులో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గాజాలో అమాయక పౌరులు, పిల్లలు ఆహారం, తాగునీరు, వైద్యం అందక చనిపోతున్నారు. దీనిపై ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. గాజాకు సాయం అందించేందుకు కూడా ఇజ్రాయెల్ ఒప్పుకోకపోవడంపై పలు దేసాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఐరాస భద్రతామండలిలో ఇవాళ ఓ కీలక తీర్మానం ప్రవేశపెట్టింది.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య మానవతాకోణంలో సంధి చేసేందుకు వీలుగా ఐరాస భద్రతామండలిలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు.దీనిపై పలు దేశాలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. అనంతరం ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో కూడా పలు దేశాలు పాల్గొన్నాయి. కానీ భారత్ మాత్రం అనూహ్యంగా దూరంగా ఉండిపోయింది. దీంతో ఇన్నాళ్లూ శాంతి కాముక దేశంగా చెప్పుకునే భారత్ ఈ శాంతి ఒప్పందానికి అనుకూలంగా ముందుకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

priyanka gandhi says shocked, ashamed at india abstained from vote in UNGA for israel-hamas truce

ఐరాసలో భారత్ అనుసరించిన వైఖరిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాందీ స్పందించారు. ఐరాసలో భారత్ అనుసరించిన వైఖరి తనను షాక్ కు గురి చేసిందని, దీనిపై ఈ దేశ పౌరురాలిగా సిగ్గుపడుతున్నట్లు ప్రియాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కంటికి కన్ను సిద్ధాంతం అనుసరిస్తే లోకమే గుడ్డిది అవుతుందంటూ మహాత్మాగాందీ చెప్పిన మాటల్ని కూడా తన పోస్ట్ లో ఆమె కోట్ చేశారు. భారత్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న వైఖరికి ఇది వ్యతిరేకమన్నారు.

"మానవత్వంలోని ప్రతి చట్టాన్ని తుడిచిపెట్టి, ఆహారం, నీరు, వైద్య సామాగ్రి, కమ్యూనికేషన్ మరియు విద్యుత్తు లక్షలాది ప్రజలకు నిలిపివేయబడినప్పుడు నిలబడి మరియు మౌనంగా చూడటానికి నిరాకరించడం మరియు పాలస్తీనాలో వేలాది మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలు నిర్మూలించబడుతున్నారు. ఒక దేశంగా మన దేశం తన జీవితాంతం నిలబడిన ప్రతిదానికీ వ్యతిరేకంగా ఉంది" అని కాంగ్రెస్ నేత ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశరు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+