రాజీవ్ గాంధీ ''నా హీరో" : ప్రియాంక గాంధీ
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28వ డెత్ అనివర్సరీ సంధర్భంగా ఏఐసీసీ జనరర్ సెక్రటరీ ప్రియాంక గాంధీ నివాళులు అర్పించారు. అనంతరం ఆమే రాజీవ్ గాంధీ గత స్మృతులను గుర్తుచేసుకుంది. ఈనేపథ్యంలోనే కవి హరివంశరాయ్ బచ్చన్ కవితను పోస్ట్ చేసింది. దీంతోపాటు రాజీవ్ గాంధీ నా హిరో అంటూ చిన్ననాటీ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
కాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం రాజీవ్‌గాంధీకి నివాళులు అర్పించారు. ఈనేపథ్యంలోనే రాజీవ్ గాంధీ గౌరవ,మర్యాదల గురించి నేర్పించడంతోపాటు ఎప్పుడు విద్వేషాన్ని నేర్పలేదని చెప్పారు,కాగా రాజీవ్ గాంధీని మిస్ అవుతున్నట్టు ఆయన తెలిపారు.

కాగా ఉదయమే ఢిల్లిలోని రాజీవ్ గాంధీ సమాధి అయిన వీర్‌భూమి వద్ద యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు ,రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ, ప్రధాని నరేంద్రమోడీ లు,మాజీ రాష్ట్ర్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
You will always be my hero. pic.twitter.com/LYPciCD234
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 21, 2019












Click it and Unblock the Notifications