MNREGA: ఉపాధి హామీ పథకం పేరు మార్పు..! ఏంటీ మైండ్ సెట్ అన్న ప్రియాంక..!

2005లో యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలో ఎన్డీయే సర్కార్ తాజాగా మార్చేసింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎం నరేగా)గా ఉన్న పేరు కాస్తా పూజ్య బాపూ గ్రామీణ్ రోజ్ గార్ గా మర్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతిపిత పేరుతో ఉన్న పథకం పేరు మార్చడం ద్వారా ఏం సాధిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఉపాధి హమీ పథకం పేరు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా తప్పుబట్టారు. ఎంనరేగా పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గా మార్చడంపై స్పందిస్తూ.. "దీని వెనుక ఏ మనస్తత్వం ఉందో నాకు అర్థం కాలేదు. అన్నింటిలో మొదటిది, ఇది మహాత్మా గాంధీ పేరు, మరియు పేరు మార్చబడినప్పుడు, ప్రభుత్వ వనరులు మళ్ళీ దానిపై ఖర్చు చేయబడతాయి... ఇది డబ్బు ఖర్చు చేసే పెద్ద ప్రక్రియ, కాబట్టి అనవసరంగా ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? నాకు అర్థం కాలేదు." అంటూ ఫైర్ అయ్యారు.

Priyanka Gandhi Slams MNREGA Scheme Name Change Can t Understand What Mentality Is Behind This

మరోవైపు ఇతర ప్రతిపక్ష పార్టీలు, విమర్శకులు కూడా ఉపాధి హామీ పథకం పేరు మార్పును రాజకీయ నిర్ణయంగా ఖండిస్తున్నారు. గతంలో తాము విమర్శించిన, ప్రజాదరణ పొందిన పథకాన్ని కేంద్రం తమదిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాజా మార్పును అసలు ఉపాధి హామీ పథకం వారసత్వాన్ని తుడిచిపెట్టి, దానిని ప్రస్తుత ప్రభుత్వ సొంత పథకంగా మార్పు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+