భారీ లేఆఫ్ ప్రకటించిన కంపెనీ: నగదు డిపాజిట్లు ఉంటే గల్లంతే: వెంటనే విత్ డ్రా
రియల్ మనీ/ఆన్ లైన్ గేమింగ్ వల్ల ప్రతి సంవత్సరం సుమారు 45 కోట్ల మంది జేబులకు చిల్లుపడుతోంది. దాదాపు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల మేర సొమ్మును కోల్పోతున్నారు. సమాజానికి ఇదొక ప్రధాన సమస్యగా మారడం వల్లే కేంద్ర ప్రభుత్వం వీటిని నిషేధించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ నిషేధం వల్ల అటు ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఆదాయపరంగా నష్టపోయినప్పటికీ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ గేమింగ్ నిషేధం బిల్లును ఆమోదించంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

ప్రతి సంవత్సరం 45 కోట్ల మంది.. తమ కష్టార్జితాన్ని ఆన్ లైన్ గేమింగ్ వల్ల నష్టపోతున్నారని తెలిపింది. దీనివల్ల సంభవించే మొత్తం నష్టం సుమారు రూ. 20,000 కోట్లుగా అంచనా వేసింది. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు- 2025ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని ఆమోదింపజేసుకుంది.
ఈ బిల్లు ప్రకారం- మనీ గేమింగ్‌లో పాలుపంచుకున్న సంస్థలపై ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలను అందించే ఏ వ్యక్తికైనా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు.
దీని తర్వాత రియల్-మనీ గేమింగ్ కంపెనీ ప్రోబో లేఆఫ్స్ ను ప్రకటించింది. యూజర్లు వెంటనే తమ క్యాష్ డిపాజిట్లు, బ్యాలెన్స్ మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని సూచించింది. నో యువర్ కస్టమర్ (KYC)ని పూర్తి చేయాలని కోరింది. నగదును ఉపసంహరించుకోవడానికి KYCని పూర్తి చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయని యూజర్లు.. వెంటనే యాప్ ద్వారా దీన్ని పూర్తి చేయాలని ప్రొబో యాజమాన్యం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. యూజర్ల డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని భరోసా ఇచ్చింది. వారి నుంచి అందే ప్రతి విత్ డ్రా రిక్టెస్ట్ ను కూడా అత్యవసరమైనదిగా భావిస్తామని, సకాలంలో ప్రాసెసింగ్‌ను పూర్తి చేస్తామని తెలిపింది.
దీనికోసం వీలైనంత త్వరగా KYC పూర్తి చేయాలని ప్రొబో సూచించింది. ఆన్ లైన్ గేమింగ్ కార్యకలాపాలను నిలిపివేయాల్సి రావడం వల్ల లేఆఫ్స్ ను విధించినట్లు వివరించింది. ఉద్యోగులు, యూజర్ల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. KYCని పూర్తి చేయడం, బ్యాలెన్స్‌లను ఉపసంహరించుకోవడానికి అనుసరించాల్సిన విధానాలపై యాప్ లో సమగ్ర సమాచారాన్ని పొందుపర్చినట్లు పేర్కొంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications