వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ ముందు నలుగురు సీఎంలతోపాటు 12 ప్రతిపక్ష పార్టీల 9 ప్రధాన డిమాండ్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేపట్టాలని కోరుతూ 12 ప్రతిపక్ష పార్టీల నేతలు(వీరిలో నలుగురు ముఖ్యమంత్రులు) 9 ప్రధాన డిమాండ్లతో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

ఈ లేఖపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్‌డీ దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతకాలు చేశారు.

 Procure Vaccines From All Sources, Halt Central Vista Project: 12 Opposition Leaders Write to PM Modi

ప్రతిపక్ష నేతలు చేసిన 9 సూచనలు..

1. దేశ విదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లు సేకరించాలి.
2. దేశ వ్యాప్తంగా అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించాలి.
3. కంపల్సరీ లైసెన్సింగ్ నింబంధనను అమలు చేసి దేశీయంగా వ్యాక్సిన్ అందించే కార్యక్రామన్ని తక్షణం ప్రారంభించాలి.
4. బడ్జెట్‌లోకేటాయించిన రూ. 35 వేల కోట్లు ఖర్చు చేయాలి.
5. సెంట్రల్ విస్టా నిర్మాణం తక్షణం నిలిపేయాలి.
6. లెక్కాపత్రం లేని పీఎం కేర్స్ ఫండ్‌లో డబ్బునంతా కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, వైద్య పరికరాల కొనుగోలుకు విడుదల చేయాలి.
7. ఉద్యోగం లేినవారికి నెలకు రూ. 6 వేలు ఇవ్వాలి.
8. ప్రస్తుతం గోదాముల్లో కోటి టన్నుల తిండి గింజలు మగ్గిపోతున్నందున వాటిని వెంటనే పేదలకు ఉచితంగా పంచిపెట్టాలి.
9. కొత్తసాగు చట్టాలను రద్దు చేసి ప్రస్తుత మహమ్మారి సమయంలో ఆందోళన చేస్తున్న రైతుల ప్రాణాలను కాపాడాలి.

తాము ముందు నుంచీ విడివిడిగా, కలిసికట్టుగానూ సూచనలు, సలహలు ఇస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. ఫలితంగా ఇప్పుడు దారుణమైన మానవ విషాదం నెలకొందని, ఇప్పటికైనా మేల్కొని తమ సూచనలు తక్షణమే అమలు చేసి దేశ ప్రజలను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

English summary
Looking at the rising cases of coronavirus across the country, leaders of 12 opposition parties on Wednesday wrote to a letter Prime Minister Narendra Modi and sought free mass vaccination campaign against coronavirus, and suspension of the central vista revamp project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X