వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోస్యం చెప్పినందుకు జాబ్ పోయింది!

|
Google Oneindia TeluguNews

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో ఓ ప్రొఫెసర్ జోస్యం చెప్పి ఇబ్బందుల పాలయ్యారు. ఉజ్జయినిలోని విక్రమ్ యూనివర్సిటీలో జ్యోతిష్య శాస్త్ర ప్రొఫెసర్ అయిన రాజేశ్వర్ శాస్త్రి ముసల్గావ్కర్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పి సస్పెండ్ అయ్యారు. యూనివర్సిటీ నిబంధనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి సోషల్ మీడియాలో రాజకీయపోస్టులు పెట్టినందుకు ఆయనను విధుల నుంచి తొలగించారు.

బాదం పప్పు, కంటి చుక్కల మందు : రుణమాఫీపై వ్యాఖ్యలతో శివరాజ్‌కు కాంగ్రెస్ గిఫ్ట్ ప్యాక్బాదం పప్పు, కంటి చుక్కల మందు : రుణమాఫీపై వ్యాఖ్యలతో శివరాజ్‌కు కాంగ్రెస్ గిఫ్ట్ ప్యాక్

ఫేస్‌బుక్‌లో బీజేపీ అనుకూల పోస్ట్

ఫేస్‌బుక్‌లో బీజేపీ అనుకూల పోస్ట్

జోతిష్య శాస్త్ర డిపార్ట్‌మెంట్ హెడ్ అయిన ముసల్గావ్కర్ ఇటీవల తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో బీజేపీకి దాదాపు 300, ఎన్డీఏకు 300లకు పైగా సీట్లు వస్తాయని పోస్ట్ చేశారు. దీనిపై మధ్యప్రదేశ్ స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బబ్లూ కించీ యూనివర్సిటీ అధికారులకు కంప్లైంట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

వివరణతో సంతృప్తి చెందని అధికారులు

వివరణతో సంతృప్తి చెందని అధికారులు

కాంగ్రెస్ నేత ఫిర్యాదుపై స్పందించిన యూనివర్సిటీ అధికారులు ప్రొఫెసర్ ముసల్గావ్కర్‌కు నోటీసులు జారీ చేశారు. ఫేస్‌బుక్ పోస్టుపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. విచారణ కమిటీ ఎదుట హాజరైన ఫ్రొఫెసర్ తన వాదనను వివరించారు. దాంతో సంతృప్తి చెందిన ఉన్నతాధికారులు ముసక్గావ్కర్‌ను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ముగిసే వరకు ఆయనను జియాలజీ డిపార్ట్‌మెంట్‌కు అటాచ్ చేశారు.

సస్పెన్షన్ ఎత్తివేయాలంటున్న బీజేపీ

సస్పెన్షన్ ఎత్తివేయాలంటున్న బీజేపీ

బీజేపీ 300 సీట్లు గెలుస్తుందని చేసిన పోస్ట్‌కు ముసల్గావ్కర్ ఆ మర్నాడే క్షమాపణ కోరారు. ఫేస్‌బుక్‌లో పోస్టును తొలగించారు. అయితే ప్రొఫెసర్ సస్పెన్షన్‌పై బీజేపీ నేతలు స్పందించారు. జోస్యం చెప్పడం ముసల్గావ్కర్ విధి అని, అందుకే వెంటనే అతనిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
A professor of Vikram University in Ujjain was suspended for predictiong BJPs victory in general Election. he was found violating the model code of conduct, and posted his prediction on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X