Property: మామ ఫ్యామిలీ మొత్తాన్ని చంపించిన పెద్ద కోడలు, ఆస్తి కోసం ఎంతపని చేసింది, ఎస్కేప్ !
ఆస్తి తగాదాల కారణంగా ఒకే ఫ్యామిలీలో నలుగురిని హత్య చేశారు. మామా, పెద్ద కోడలి మధ్య ఆస్తి కోసం జరిగిన గొడవల్లో ఒకే ఫ్యామిలీలో అందర్ని కోడలు హత్య చేయించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
బెంగళూరు/మంగళూరు: ఆస్తి తగాదాల కారణంగా ఒకే ఫ్యామిలీలో నలుగురిని మారణాయుధాలతో అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో తప్పించుకున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు నిందితుల నుంచి తప్పించుకున్నారు. మామా కోడలి మధ్య ఆస్తి కోసం జరిగిన గొడవల్లో ఒకే ఫ్యామిలీలో అందర్ని కోడలు హత్య చేయించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ఫ్యామిలీ మొత్తం టార్గెట్
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ తాలూకాలోని హడువల్లి ఓనిబాగిలు గ్రామంలో ఒకే ఫ్యామిలీలో నలుగురిని హత్య చెయ్యడం కర్ణాటకలో కలకలం రేపింది. ఓనిబాగిలో నివాసముంటున్న శంభు హెగ్డే (65), ఆయన భార్య మాదేవి హెగ్డే (58), ఆయన కుమారుడు రాజీవ్ హెగ్డే (40), కోడలు కుసుమ భట్ (32) దారుణ హత్యకు గురయ్యారు. శంభు హెగ్డే ఫ్యామిలీలోని ఇద్దరు పిల్లలు ప్రత్యర్థుల దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో భయపపడ్డారు.

కిడ్నీ వ్యాధితో చనిపోయిన కొడుకు
శుంభు హెగ్డేకి మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుర్లు వివాహాలు చేసుకుని వారి భర్తలతో కాపురం చేస్తూ వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. శంభు హెగ్డే కొడుకు శ్రీధర్ హెగ్డే కిడ్నీ వ్యాధితో చాలాకాలం క్రితం మరణించారు. మరో కొడుకుతో పట్టణంలో సంతోషంగానే జీవితం గడుపుతున్నారు. శంభు హెగ్డే ఫ్యామిలీకి చాలా మంది బంధువులు ఉన్నారు.

కోడలితో ఆస్తి గొడవలు
శంభు హెగ్డే పెద్ద కొడుకు శ్రీధర్ చనిపోయిన తరువాత అతని భార్య విద్యా భర్త ఆస్తిని స్వాధీనం చేసుకోవాలి అనుకుంది. ఇదే విసయంలో శంభు హెగ్డే. ఆయన పెద్ద కోడల విధ్యా మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శంభు హెగ్డే, ఆయన మరో కుమారుడు రాజీవ్ హెగ్డేలకు ఆస్తిలో విధ్యాకు పూర్తి భాగం ఇవ్వడానికి అంగీకరించలేదు. తరువాత పెద్ద కోడలు విధ్యా నా ఆస్తిని నాకు ఇచ్చేస్తే నేను వేరే జీవితాన్ని గడుపుతానని మామ శంభు హెగ్డేకి చెప్పింది.

కూతుర్లకు ఆస్తి పంచిన శంభు హెగ్డే
శంభు హెగ్డే ఆయన ఆస్తిని తన ఇద్దరు కూతుళ్లతో సమానంగా పంచుకున్నాడు. అయితే పెద్ద కుమారుడు శ్రీధర్ భార్య విధ్యాకు ఇచ్చే ఆస్తి తగ్గిపోయిందని విధ్యా సోదరుడు వినయ భట్, శంభు హెగ్డే కుటుంబీకులు తరచూ గొడవ పడుతుండేవారు. శుక్రవారం విధ్యా సోదరుడు వినయ్ భట్ అతని అక్కకు చెందిన స్థలంలో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో శంభు హెగ్డే వెళ్లి వినయ్ మీద గొడవకు దిగాడు.

నరికి చంపేశారు
విధ్యా సోదరుడు వినయ్ భట్ తో పాటు అతని సమీప బంధువు శ్రీధర్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో మాటామాటా పెరిగింది. వేటకొడవళ్లు తీసుకు్న వినయ్, శ్రీధర్ శంభు హెగ్డే, ఆయన భార్య, రెండో కుమారుడు రాజీవ్, రెండో కోడలు కుసుమాను దారుణంగా నరికి చంపేశారు. రాజీవ్ ఇద్దరు పిల్లల్లో ఒకరు ఇంట్లో నిద్రపోతుంటే మరో కుమారుడు స్కూల్ కు వెళ్లడంతో ప్రాణాలతో భయటపడ్డారు. ఆస్తి తగాదాల కారణంగా కోడలి సోదరులు శంభు హెగ్డేలోని నలుగురిని ఒకేసారి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. నలుగురి హత్య కేసులో వినయ్, శ్రీధర్ లను అరెస్టు చేశామని, ఇంత జరగడానికి కారణం అయిన విధ్యా పారిపోయిందని బత్కల్ పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications