చదవండి: అరుంధతిరాయ్‌కి 'గాంధీ జీవితచరిత్ర' పంపారు

ఆమె మహాత్ముడి పుస్తకాన్ని చదువుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. జాతిపిత పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, జాతిపిత మహాత్మా గాంధీ పైన బుకర్ ప్రైజ్ విజేత, ప్రముఖ రచయిత అరుంధతీ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాంధీజీ కులతత్వ భావాలు ప్రదర్శించారని, జాతిపితగా ఆయన అనర్హుడని, ఆ హోదాకు మరొకరిని ఎంచుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఆయన పేరుతో ఉన్న విశ్వవిద్యాలయాలకు, సంస్థలకు పునఃనామకరణం చేయాలని డిమాండ్ చేశారు. కేరళ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
1936లో గాంధీ రాసిన 'ద ఐడియల్ భంగీ' వ్యాసంలో మలమూత్రాదులను పారవేయకుండా, ఎరువుగా మార్చుకోవాలని పాకీ పని వారికి సూచించారని అరుంధతి చెప్పారు. గాంధీకి హరిజనులపై ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. అలాంటి భావాలే నేటి కులాధిపత్య ధోరణులకు బీజం వేశాయని ఆమె విమర్శించారు.












Click it and Unblock the Notifications