విమాన ప్రయాణికులకు బంద్ సెగ
బెంగళూరు: కావేరి నీటి కోసం కన్నడిగులు చేస్తున్న బంద్ కారణంగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)లో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.
భారత్ తో పాటు వివిద దేశాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులు గమ్యస్థానం చేరుకోవడానికి రవాణ సౌకర్యం లేకపోవడంతో ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ ఉంటుందని ముందుగానే సమాచారం ఇచ్చారు.
ఎయిర్ పోర్టుకు సంచరించే ట్యాక్సీలు, క్యాబ్ లు ఓల్వా బస్సులు నిలిచిపోయాయి. ఒక్క బస్సు కాని, కారు కాని ఎయిర్ పోర్టు చేరుకోలేదు. విమాన ప్రయాణికులు బెంగళూరుతో పాటు వారి సొంత ప్రాంతాలకు వెళ్లడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది.

ఎయిర్ పోర్టు అధికారులు, సిబ్బంది తాము వాహనాలు ఏర్పాటు చెయ్యలేమని తేల్చి చెప్పడంతో వారు అక్కడే ఉండిపోయారు. సాయంత్రం ఆరు గంటల తరువాత వాహనాలు పంపిస్తామని ఓలా, ఉబర్ తదిత ట్యాక్సీల నిర్వహకులు ప్రయాణికులకు సమాచారం ఇచ్చారు.
బెంగళూరు-బళ్లారి రహదారిలో నిత్యం వేల సంఖ్యలో సంచరించే ట్యాక్సీలు ఒక్కటి కూడా అటు వైపు వెళ్లలేదు. ఆందోళనకారులు ఎక్కడ తమ వాహనాలు ధ్వంసం చేస్తారో అని భయంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేశారు.












Click it and Unblock the Notifications