Karnataka Polls : నందినీ ముద్దు-అమూల్ వద్దంటున్న కర్నాటక-బీజేపీకి ముచ్చెమటలు..!
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. దీనికి కారణం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మాత్రమే కాదు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం కూడా. ఎక్కడో గుజరాత్ లో సహకార పాల సేకరణ సంస్ధ అయిన అమూల్ ను రాష్ట్రంలోకి ఆహ్వానిస్తూ బొమ్మై సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కన్నడిగులకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీనిపై కర్నాటక ఏకమవుతోంది.
కర్నాటకలో అమూల్ ఎంట్రీని నిరసిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. విపక్షాలతో పాటు కర్నాటక పాల వ్యాపారుల సమాఖ్య కేఎంఎఫ్ నేతృత్వంలో నిరసనలు జరుగుతున్నాయి. కర్నాటక పాల సమాఖ్యకు చెందిన నందినీ పాలే తమకు కావాలి, అమూల్ వద్దంటూ పలు నగరాల్లో నిరసనలు చేపడుతున్నారు. దీంతో బీజేపీ సర్కార్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అమూల్ వద్దంటే బీజేపీ పెద్దలకు కోపం, ఆహ్వానిస్తే రాష్ట్రంలో వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో బీజేపీకి చుక్కలు కనిపిస్తున్నాయి.

అమూల్ కు వ్యతిరేకంగా, నందినీ పాలకు మద్దతుగా రాష్ట్రంలో నిరసనలు జోరందుకుంటున్నాయి. దీంతో బెంగళూరులోని హోటళ్లు సైతం నందినీ పాలే తీసుకుంటామని ప్రకటించాయి. అలాగే పలు నగరాల్లోనూ హోటల్ యజమానులతో పాటు ఇతర వ్యాపారస్తులు సైతం అమూల్ పాలు వద్దంటూ ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు విపక్ష కాంగ్రెస్ కూడా అమూల్ రాకను నిరసిస్తూ ఆందోళనలు చేపడుతోంది. దీంతో ఎన్నికల వేళ అమూల్ వివాదం తమను ఎక్కడ ముంచుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
#WATCH | Bengaluru: Karnataka Rakshana Vedike protests to oppose the sale of Amul milk in Karnataka & encourage Nandini products. pic.twitter.com/LQThDsaswY
— ANI (@ANI) April 10, 2023
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
శివరాత్రి రోజు మటన్ తిన్నా.. శుభ ముహూర్తాలను నమ్మను: సీఎం సంచలనం -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు











Click it and Unblock the Notifications