స్కూల్‌లో 6వ తరగతి విద్యార్థినికి లైంగిక వేధింపులు: పిఈటి అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని ఓ పబ్లిక్ స్కూల్‌లో పిఈటి(ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)గా పని చేస్తున్న 30ఏళ్ల వ్యక్తి అదే పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
గత కొన్ని సంవత్సరాల నుంచి నిందితుడు జితేందర్ సింగ్ ఆ పాఠశాలలో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. జనవరి 16న తమకు బాధిత బాలిక తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. బాలికను నిందితుడు తన తొడలపై కూర్చొబెట్టుకొని ఆమె ప్రైవేటు భాగాలను తాకాడని పిర్యాదులో పేర్కొన్నారు.

తమ కూతురు మొదట ఈ విషయాన్ని చెప్పలేదని, అయితే పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించిందని తెలిపారు. ఆమెను ప్రశ్నిస్తే పిఈటి వికృతచేష్టలను బయటపెట్టిందని చెప్పారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications