ప్రాణం తీసిన PUBG: చెవులు, ముక్కు నుంచి రక్తం కారి..

మొబైల్ గేమ్స్ సరదా కాస్తా వ్యసనంగా మారి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్న యువతకు ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన మహ్మద్ కైఫ్ (22) అనే యువకుడు మొబైల్ గేమింగ్ మత్తులో ప్రాణాలు కోల్పోయాడు.

మహ్మద్ కైఫ్ గత నాలుగు నెలలుగా PUBG (పబ్జీ) గేమ్‌కు విపరీతంగా అలవాటుపడ్డాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం ఆ గేమ్‌లోనే మునిగిపోయేవాడు. గత శుక్రవారం రాత్రి కూడా అలాగే హెడ్‌ఫోన్స్ తగిలించుకుని, బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి అర్ధరాత్రి వరకు గేమ్ ఆడుతూనే ఉన్నాడు.

PUBG

తీవ్రమైన ఉత్కంఠ (Excitement), మెంటల్ ప్రెజర్‌తో గేమ్ ఆడుతున్న క్రమంలో.. ఒక్కసారిగా కైఫ్ కుప్పకూలిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అతడి ముక్కు, చెవుల నుంచి రక్తం కారడం చూసి అందరూ షాక్‌కు గురయ్యారు.

డాక్టర్ల విశ్లేషణ: బీపీ 300 దాటితే ఎలా ఉంటుందంటే..

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కైఫ్ మరణించాడు. అయితే, అతడి మరణానికి గల కారణాలు విని వైద్యులే విస్తుపోయారు. గేమ్ ఆడుతున్న సమయంలో కలిగిన తీవ్రమైన మానసిక ఒత్తిడి (Mental Pressure) వల్ల అతడి రక్తపోటు (Blood Pressure) ఒక్కసారిగా 300 దాటిపోయింది. అంతటి అధిక బీపీని తట్టుకోలేక మెదడులోని నరాలు చిట్లిపోయి (Brain Hemorrhage) రక్తస్రావం జరిగింది. దీనివల్లే ముక్కు, చెవుల నుంచి రక్తం బయటకు వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు.

యువతకు ఇదొక హెచ్చరిక!

మహమ్మారి తర్వాత స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, అందులోనూ ఇలాంటి యాక్షన్ గేమ్‌లకు యువత బానిసవ్వడం ప్రాణాంతకంగా మారుతోంది. గంటల తరబడి ఏకాగ్రతతో, ఉద్వేగంతో గేమ్స్ ఆడటం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+