పబ్జీ ఎఫెక్ట్ .. టాప్ స్టూడెంట్ పరీక్షల్లో ఫెయిల్
పబ్జీ గేమ్ .. ఒక టాప్ స్టూడెంట్ ను ఫెయిల్ అయ్యేలా చేసింది. పబ్జీ ఆట ఆడడం వల్ల యువత మానసిక స్థితిలో మార్పు వస్తుందని, దానికి యువత అడిక్ట్ అవుతున్నారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇక తల్లిదండ్రులు పిల్లలను ఈ పబ్జీ బారి నుండి కాపాడాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. అయినా పబ్జీ ఆడుతున్న విద్యార్థులు ఏదో ఒక అనర్ధాలను కొని తెచ్చుకుంటున్నారు.
తాజాగా బెంగళూరుకు చెందిన ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ,టాప్ స్టూడెంట్ పబ్జీ ఆట ఆడుతూ చదువును చాలా నిర్లక్ష్యం చేశాడు. అతను ఎంతగా చదువును నిర్లక్ష్యం చేశాడంటే పరీక్షల్లో పబ్జీని ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది సమాధాన పత్రంలో రాసేంత గా పబ్జీకి అడిక్ట్ అయ్యాడు సదరు విద్యార్థి. దీంతో అతను ప్రీ యూనివర్సిటీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు. ఇది చూసి షాక్ తిన్న అధ్యాపకులు యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కు ఈ విషయం తెలియజేశారు.

దాంతో సదరు ప్రిన్సిపల్ తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పారు. తల్లిదండ్రులు సైతం పబ్జీ ఆడవద్దని తమ కుమారుడు కి చెప్పామని ప్రిన్సిపాల్ కి తెలిపారు.
ఇక పబ్జీ కి పూర్తిస్థాయిలో అడిక్ట్ అయిన విద్యార్థి సైతం పబ్జీ వల్లే తాను ఫెయిల్ అయ్యాను అని ఒప్పుకున్నాడు. పబ్జీ ఆడకుంటే ఉండలేక పోతున్నానని చెప్పిన విద్యార్థి, తన తల్లిదండ్రులు పబ్జీ ఆడనివ్వడంలేదని దీంతో గేమ్ ను మిస్ అవుతున్నానని చెప్తున్నాడు. చదువులో తాను వెనుకబడటానికి పబ్జీ ఆట కారణమని, గంటలకొద్దీ పబ్జీ గేమ్ ఆడాలి అనిపిస్తుందని, అంత వ్యసనంలా తనకు పబ్జీ గేమ్ మారిపోయిందని విద్యార్థి ఒప్పుకున్నాడు.
మొత్తానికి ఒక టాప్ స్టూడెంట్ ను ఫెయిల్ అయ్యే దాకా తీసుకు వచ్చింది పబ్జీ ..












Click it and Unblock the Notifications