షాకింగ్: కూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం, రూ.లక్షకు వ్యభిచార గృహానికి అమ్మేసిన మామయ్య..
కన్న కూతురునే కనికరం కూడా లేకుండా ఏళ్లతరబడి కసాయి తండ్రి అత్యాచారం చేయగా, ఆపైన ఆమెను లక్ష రూపాయలకు ఓ వ్యభిచార గృహానికి విక్రయించాడు ఆమె మామయ్య. ఈ దారుణ ఉదంతం మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగుచూసింది
పూణే : కన్న కూతురునే కనికరం కూడా లేకుండా ఏళ్లతరబడి కసాయి తండ్రి అత్యాచారం చేయగా, ఆపైన ఆమెను లక్ష రూపాయలకు ఓ వ్యభిచార గృహానికి విక్రయించాడు ఆమె మామయ్య. ఈ దారుణ ఉదంతం మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగుచూసింది.
ఆ పదహారేళ్ల బాలికను ఎరవాడ వ్యభిచార గృహం నుంచి కాపాడి బాలసదనానికి తరలించిన పోలీసులు.. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించిన ఆ కసాయి తండ్రితోపాటు సవతి తల్లి, మామయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు...
వ్యభిచార గృహంపై జరిపిన దాడిలో పట్టుబడిన సదరు బాలిక ను పోలీసులు విచారించారు. ఈ విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆ బాలిక(16) తల్లి.. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక 2010 లోనే ఆత్మహత్య చేసుకోగా, ఆ ఘటనలో ఆమె తండ్రిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు.

పెళ్లామున్నా.. కూతుర్నీ వదల్లేదు...
మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి 2013లో విడుదలై వచ్చిన తండ్రి మరో మహిళను పెళ్లాడినా నిత్యం కూతురిపై కూడా అత్యాచారం చేసేవాడు. ఇలా మూడేళ్లపాటు ఆ బాలికపై వారు దారుణానికి పాల్పడ్డారు. గర్భం రాకుండా తన సవతి తల్లి గర్భనిరోధక మాత్రలు తినిపించేదని బాధిత బాలిక పోలీసులకు చెప్పింది.

మేనత్త ఇంటికెళితే...
తండ్రి, సవతితల్లి అఘాయిత్యాలను భరించలేక 2016లో సదరు బాలిక చదువు నిమిత్తం తన తండ్రి ఇంటినుంచి మేనత్త ఇంటికి వెళ్లిపోయింది. ఆమె మామయ్య ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేసేవాడు. అయితే ఆ వ్యాపారంలో అతడు బాగా నష్టపోయి ఉన్నాడు. ఒక దశలో టెంపోను అమ్మేద్దామని కూడా భావించాడు.

టెంపో బదులు అమ్మాయిని అమ్మేశాడు...
అయితే దానికన్నా మరో అద్భుతమైన ఉపాయం తట్టిందతడికి. దీంతో లక్షరూపాయలకు ఆ బాలికను ఓ వ్యభిచార గృహానికి విక్రయించాడు. ఈ విషయాన్ని సదరు బాలిక తాను చదువుకుంటున్న స్కూల్లోని టీచర్ల దృష్టికి తీసుకురాగా వారు ఆమె మేనత్తకు విషయం చేరవేశారు.

పోలీసుల దాడితో విముక్తి...
కానీ అక్కడ కూడా విధి ఆ బాలికనే వెక్కిరించింది. తన భర్త లక్ష రూపాయల కోసం తన మేనకోడలిని వ్యభిచార గృహానికి అమ్మేశాడని తెలిసిన తరువాత కూడా ఆమె మేనత్త మౌనం వహించడం తప్ప ఏం చేయలేకపోయింది. చివరికి సదరు వ్యభిచార గృహంపై పోలీసులు దాడి జరపగా ఈ బాలికకు విముక్తి కలిగింది.

అవాక్కయిన పోలీసులు...
వ్యభిచార గృహంపై పోలీసుల జరిపిన దాడితో ఆ బాలికకు విముక్తి లభించింది. అయితే ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు వివరాలు అడగ్గా.. అప్పుడు ఆ బాలిక తన జీవితంలో మొదటి నుంచీ జరిగినదంతా చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులే అవాక్కయ్యారు. తానెవరి దగ్గరికీ వెళ్లనని ఆ బాలిక చెప్పడంతో ఆమెను పోలీసులు బాలసదనానికి తరలించారు.

ఇన్నాళ్లకు న్యాయం జరిగింది...
ఒక అమాయకురాలి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన ఈ కేసులో బాధితురాలికి ఇన్నేళ్ల తరువాత న్యాయం జరిగింది. ఆమె చెప్పిన వివరాల మేరకు.. బాలికపై అత్యాచారం, బలవంతంగా వ్యభిచారపు రొంపిలోకి దించినట్లు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తరువాత ఆమె తండ్రి, సవతి తల్లితోపాటు, మామయ్యను వ్యభిచార గృహం నిర్వాహకురాళ్లను కూడా అరెస్టు చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications